13 ఏళ్ళ `సింగూర్’ తర్వాత ఐప్పుడు టాటాకు బెంగాల్ స్వాగతం!

పశ్చిమ బెంగాల్ లో 34 ఏళ్ళ వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించి, 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసిని అధికారమలోకి తీసుకు రావడానికి కారణమైన సింగూర్ లో భూసేకరణ వ్యక్తిరేక ఉద్యమం జరిగిన 13 ఏళ్లకు టాటాలను తిరిగి పెట్టుబడులకు బెంగాల్ రావాలని అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తున్నది.

ఆ ఉద్యమం కారణంగా అక్కడ కార్ల ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న టాటా గ్రూప్ తిరిగి ఆ రాష్ట్రంవైపు చూడక పోవడం తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టె విధంగా టాటాలతో చర్చలు జరుపుతున్నామని బెంగాల్  రాష్ట్ర పరిశ్రమ, ఐటి మంత్రి పార్థా ఛటర్జీ తాజాగా వెల్లడించారు. 

ఉద్యోగ కల్పన టిఎంసి ప్రభుత్వం అజెండాలో ప్రధానమని పేర్కొంటూ కంపెనీలకు ప్రోత్సాహకాలు ఉపాధి కల్పించే సామర్థ్యాన్ని బట్టి ఉంటుందని తెలిపారు. రెండు ప్రముఖ ఉత్పాదక యూనిట్లను ఏ ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయినా త్వరగా ఏర్పాటు చేయాలని కోరుకుంటుందని మమతా కోరుకొంటున్నట్లు చెప్పారు.

“టాటా తో  మాకు ఎప్పుడూ శత్రుత్వం లేదు, మేము వారికి వ్యతిరేకంగా పోరాడలేదు. వారు ఈ దేశంలో, విదేశాలలో కూడా అత్యంత గౌరవనీయమైన, అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకరు” అని చెప్పుకొచ్చారు.

“మేమెప్పుడూ టాటాలను నిందించలేరు (సింగూర్ అపజయం కోసం). లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం, దాని బలవంతపు భూసేకరణ విధానంతో సమస్య ఏర్పడింది. టాటా గ్రూప్ బెంగాల్‌లోకి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాము” అని  టిఎంసి సెక్రటరీ జనరల్ కూడా అయినా ఛటర్జీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

“మాకు ఇప్పటికే టాటా మెటాలిక్స్ ఉనికి ఉంది. ఇక్కడ టిసిఎస్ కాకుండా ఒక టాటా సెంటర్. తయారీ లేదా ఇతర రంగాలలో పెద్ద  పెట్టుబడులు పెట్టడానికి వారు సుముఖంగా ఉంటే, సమస్య లేదు. మా ఐటి కార్యదర్శి ఇటీవల ఇక్కడ టాటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి చూపారని నాకు చెప్పారు, ”అని ఆయన పేర్కొన్నారు.

ఒకప్పుడు బహుళ పంటల పెంపకానికి పేరుగాంచిన సింగూర్, 2006 లో టాటా మోటార్స్ తన చౌకైన కారు నానోను నిర్మించడానికి భూమిపై దృష్టి సారించిన తరువాత మీడియా వెలుగులోకి వచ్చింది. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం జాతీయ రహదారి 2 వెంట 997.11 ఎకరాలను స్వాధీనం చేసుకుని దానిని కంపెనీకి అప్పగించింది.

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మమతా బెనర్జీ 26 రోజుల నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. 347 ఎకరాల వ్యవసాయ భూములను “బలవంతంగా” స్వాధీనం చేసుకున్నారు. టిఎంసి, లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాల మధ్య అనేక రౌండ్ల సమావేశాలు జరిగినా  ఈ సమస్య పరిషాకారం కాలేదు. 

 
 నితో చివరకు టాటా లు సింగూర్ నుండి 2008 లో గుజరాత్ లోని సనంద్ కు వెళ్లారు. ఈ ప్రాజెక్ట్ కోసం స్వాధీనం చేసుకున్న భూమిని అధికారంలోకి వచ్చిన తరువాత 2016 లో రైతులకు తిరిగి ఇచ్చివేశారు. సింగూర్‌లో, నందిగ్రామ్‌లో ఈ భూమిని స్వాధీనం చేసుకోవటానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం 2011 లో మమతా బెనర్జీని అధికారంలోకి  తీసుకొచ్చింది. 
 
2016 ఆగస్టు 31 న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, సింగూర్ భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం బెంగాల్‌లోని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో భాగంగా మారింది. మమతా బెనర్జీ దీనిని ఒక మైలురాయి తీర్పుగా  అభివర్ణించారు. ఇటీవలే, అసెంబ్లీ ఎన్నికలకు ముందే, అప్పుడు బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ముకుల్ రాయ్ సింగూర్ నుండి టాటా లను తరిమికొట్టడం భూ ఆందోళన తప్పు అని విమర్శించారు.  అయితే ఆయన ఎన్నికల అనంతరం టిఎంసిలో చేరారు.

కాగా,  సింగూర్‌లో మరోసారి కార్ల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం టాటాస్‌ను ఆహ్వానిస్తుందా అని అడిగినప్పుడు, పార్థా ఛటర్జీ, “టాటా లు సింగూర్‌కు ఎందుకు తిరిగి వెళ్లాలనుకుంటారు? ఇప్పటికే భూమిని తిరిగి రైతులకు ఇచ్చేసాము. ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నందున మేము అక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో ముందుకు రావాలని యోచిస్తున్నాము ” అని స్పష్టం చేశారు. 

అయినప్పటికీ, “బలవంతపు సేకరణ లేదు” అనే ప్రభుత్వ భూ విధానంలో ఎటువంటి మార్పు ఉండదని ఛటర్జీ చెప్పారు.
పరిశ్రమలు సొంతంగా లేదా ప్రభుత్వ నోటిఫైడ్ ల్యాండ్ బ్యాంక్, పారిశ్రామిక పార్కుల నుండి భూమిని పొందవలసి ఉంటుందని తెలిపారు.

సింగూర్, నందిగ్రామ్ లలో భూసేకరణ వ్యతిరేక ఆందోళనల కారణంగా టిఎంసికి పరిశ్రమ వ్యతిరేక ఇమేజ్ వచ్చిందనే మాటను  ఛటర్జీ తిరస్కరించారు. అట్లాగే, కేంద్రంతో నిరంతరం ఘర్షణలకు దిగుతూ ఉండడం కొత్త పెట్టుబడులను తీసుకురావడంలో కు ఆటంకం కాదా అన్నదానికి ప్రతికూలంగా సమాధానం ఇచ్చారు.