మళ్లీ సీఎంగా ఆదిత్యనాథ్‌కే మద్దతు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని టౌమ్స్‌ నౌ-సీ ఓటర్‌ సర్వే తెలిపింది. వచ్చే ఏడాది మార్చిలో యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టౌమ్స్‌ నౌ-సీ ఓటర్‌ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.  ఈ అధ్యయనంలో 43.1 శాతం మంది యూపీలో అధికార బీజేపీకి మద్దతు తెలిపారు.
 
సుమారు 29.6 శాతం మంది సమాజ్‌ వాదీ పార్టీకి ఓటు వేస్తామని చెప్పారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 10.1 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్‌ 8.1 శాతం, 3.2 శాతం మంది ఇతరులకు ఓటు వేస్తామని వెల్లడించారు. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌కు తగిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని అడగగా  42.2 శాతం మంది యోగీకి ఓటు వేశారు. 32.2 శాతం మంది ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌కు, 17 శాతం మంది మాయావతికి, 2.9 శాతం మంది కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీకి ఓటు వేశారు.
 
ప్రధానిగా మోదీ పాలన ఎలా ఉందని అడగగా.. 44.7 శాతం మంది బాగుందని.. 19.7 శాతం మంది పరవాలేదని, 35.6 శాతం మంది బాగాలేదని చెప్పారు.  ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చ్ లలో జరుగవలసి ఉంది. 403 మంది సభ్యులు గల ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2022 మార్చ్ 14తో ముగియనున్నది. 
 
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పనితీరు బాగున్నలు 31.7 శాతం మంది తెలుపగా, మరో 23.4 శాతం మంది ఒక మాదిరిగా ఉన్నట్లు తెలిపారు.