సిఐడి అదనపు డీజీ సునీల్ కుమార్ పై కేంద్రం ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ సిఐడి అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్ చేస్తున్న చర్యల పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అతని క్రైస్తవ కార్యకలాపాలపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతూ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమ్ శాఖ లేఖ వ్రాసింది. 

అంబేద్కర్ మిషన్ పేరుతో, అనేక చోట్ల ఆయన చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలు, హిందూ వ్యతిరేక ప్రచారాలు చేస్తూ, క్రిస్టియానిటీ ఒక్కటే అందరినీ కాపాడేది అంటూ హిందూ దేవుళ్ళకు, హిందువులకు వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలను కేంద్ర హోం శాఖకు పంపుతూ, ఆయన పై చర్యలు తీసుకోవాలి అంటూ లీగల్ రైట్స్ అబ్జరవేటరీ కన్వీనర్ జోషితో పాటు, ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసారు. 
 
అలాగే ఆ ప్రసంగాలకు సంబంధించి వీడియోలు కూడా ఒక పెన్ డ్రైవ్ లో పెట్టి కేంద్ర హోంశాఖకు అందచేసారు. అయితే ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆ వీడియోలను సునీల్ కుమార్ యుట్యూబ్ నుంచి తీసేశారు. అయితే అప్పటికే అవన్నీ పెన్ డ్రైవ్ లో కేంద్రానికి చేరాయి. వీటి పై కేంద్ర హోం శాఖ విచారణ చేసింది. 
 
అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపిస్తూ, సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి అంటూ, ప్రధాన కార్యదర్హ్సికి  రాసిన లేఖలో కేంద్ర హోం శాఖ తెలిపింది. లీగల్ రైట్స్ అబ్జరవేటరీ కన్వీనర్ జోషితో పాటు, ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదు పై చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలని కూడా కోరింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు చెప్పాలని కేంద్రం ఆ లేఖలో స్పష్టం చేసింది. వీరిద్దరూ రాసిన లేఖ, ఆ వీడియోలుపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి , కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

 
ఐపీఎస్ నిభంధనలకు విరుద్ధంగా, పీవీ సునీల్ కుమార్, ఒక మతం పై విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు అంటూ, వీరిద్దరూ ఫిర్యాదు చేసారు. ఐపిఎస్ నిబంధనలకు విరుద్ధంగా, ఈ విధంగా ఒక సంస్థను ఏర్పాటు చేయటం, సంస్థ ద్వారా విదేశాల నుంచి విరాళాలు సేకరించటం, ఆ విరాళాలపై కూడా ఆడిట్ చేయాలి అంటూ, వీరిద్దరూ ఆధారాలు చూపిస్తూ, కేంద్రానికి లేఖ రాసారు.
 
ఆ ఫిర్యాదులో తీవ్రతను అర్ధం చేసుకున్న కేంద్ర హోం శాఖ, ఆ లేఖలను ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతూ తగు చర్యలు తీసుకోవాలని, ఏమి చర్యలు తీసుకున్నారో కూడా తమకు తెలిపాలి అంటూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ప్రాధమికంగా విచారణ చేసిన తరువాతే, చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తుంది.