
The Union Minister for Defence, Shri Rajnath Singh interacting with the veterans, at Leh, Ladakh on June 27, 2021.
మూడు రోజుల పర్యటన నిమిత్తం లేహ్ బయల్దేరడానికి ముందు ఇప్పుడే లడఖ్‌కు బయల్దేరుతున్నాను. అక్కడ సైనికులు, మాజీ సైనికులతో సంభాషిస్తాను. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మిస్తున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రారంభోత్సవంలో పాల్గొంటాను అని ట్విట్టర్ ద్వారా రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
రాజ్‌నాథ్ సింగ్ తన లడఖ్ పర్యటనలో సైనిక కార్యకలాపాల సన్నాహాలను తెలుసుకుంటారని సైనిక వర్గాలు తెలిపాయి. గత ఏడాది మే నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతను పరిష్కరించడానికి రెండు రోజుల క్రితం భారత-చైనా దౌత్యవేత్తల మధ్య సరికొత్త చర్చలు జరిగాయి.
తూర్పు లడఖ్‌లో అధిక ఎత్తులో ఉన్న సైనిక స్థావరాలు, నిర్మాణాలను సమీక్షిస్తారని, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంట మోహరించిన సైనికుల మనోధైర్యాన్ని పెంచుతారని వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరిలో ఒప్పందం తర్వాత భారతదేశం-చైనా ప్యాంగాంగ్ సరస్సు సమీపంలో నుంచి దళాలు, ట్యాంకులు, ఇతర సామగ్రిని ఉపసంహరించుకున్న అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తూర్పు లడఖ్‌లో పర్యటిస్తున్నారు.
More Stories
భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర
ట్రంప్ హెచ్చరికతో బందీలను విడుదలహమాస్ అంగీకారం
అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుంది