సామాన్యుల సాధికారికత కోసమే కొత్త ఐటీ నిబంధనలు

భారతదేశం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబందనలపై ఐక్యరాజ్యసమితి లేవనెత్తిన భయాలను భారత్ నివృత్తి చేసింది. కొత్తగా తీసుకొచ్చిన “సోషల్ మీడియా నిబందనలను సాధారణ వినియోగదారుల సాధీకరికత కోసం” రూపొందించినట్లు భారత్ పేర్కొంది. వివిధ వాటాదారులతో విస్తృత సంప్రదింపుల తర్వాతానే కొత్త నిబంధనలను ఖరారు చేసినట్లు తెలిపింది.
 
 “భారత రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ హక్కుకు హామీ ఉంది. స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలమైన మీడియా భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో భాగం” అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది.
 
సోషల్ మీడియా వేదికలు దుర్వినియోగం అవుతున్నట్టు పలు ఉదంతాలు వెలుగు చూడటంతో కొత్త ఐటీ నిబంధనలు తేవాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పౌర సమాజం, ఇతర భాగస్వామ్య పక్షాలతో విస్తృత స్థాయిలో చ‌ర్చించాకే 2018లో ఈ నిబంధనలను రూపొందించామని వెల్లడించింది. 
భారత దేశం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబందనలు అంతర్జాతీయ మానవ హక్కుల నియమావళిని పాటించలేదని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది
ఐక్యరాజ్యసమితిలోని భారత్‌ పర్మెనెంట్ మిషన్ యూఎన్‌హెచ్ఆర్‌సీకి ఈ మేరకు తాజాగా లేఖ రాసింది. కేంద్రం ప్రకటించిన కొత్త ఐటీ నిబంధనల పట్ల ఐక్యరాజ్య సమితి ఇటీవల ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్రం ఈ లేఖ ద్వారా తన వాదనను బలంగా  వినిపించింది
 
 పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందంలో ఉన్న గోప్యత, అభిప్రాయ స్వేచ్ఛ, వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంతర్జాతీయ చట్టం,  ప్రమాణాలను భారత్ పాటించలేదని ఆరోపిస్తూ ఐరాస జూన్ 11న కొత్త ఐటి నిబంధనల గురించి కేంద్రానికి ఒక లేఖ రాసింది. 
 
1979 ఏప్రిల్ 10న భారతదేశం ఈ నిబందనలు ఆమోదించినట్లు పేర్కొంది. సోషల్ మీడియా వేదింపులు, ఉగ్రవాద కార్యకలపాల నివారణ, అశ్లీల కంటెంట్, ఆర్ధిక మోసలను, మత విద్వేషాలను రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించే సమాచారాన్ని అరికట్టడానికి, సామాన్యుల సాధికారికత కోసమే కొత్త నిబందనలు తీసుకొచ్చినట్లు కేంద్రం ఐరాసకు తెలిపింది.
 
‘సోష‌ల్ మీడియాలో సాధార‌ణ యూజ‌ర్ల సాధికారత కోసమే ఈ నియమాలు రూపొందించాం. సోషల్‌ మీడియా దుర్వినియోగం బారిన ప‌డ్డ బాధితుల‌ వేదన పరిష్కారానికి ఇదొక వేదిక అవుతుంది’ అని ఐరాసకు రాసిన లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. 
 
‘సోషల్’ బాధితులు సమస్యలను పరిష్కరించేందుకు ఓ గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థ అవసరముందని కూడా అభిప్రాయపడింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం అవసరమైన వ్యవస్థలను నెలకొల్పాలన్న భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను కూడా కేంద్రం తన లేఖలో ప్రస్తావించింది.