రాజకీయ విద్వేషంతోనే రామజన్మభూమి ట్రస్టుపై ఆరోపణలు 

రామాలయ ప్రాంగణం కోసం పెంచిన ధరలకు విలువైన భూమిని కొనుగోలు చేశారని ప్రతిపక్ష పార్టీలు చేసిన మోసం ఆరోపణలను శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీలు ఈ ఆరోపణలను రాజకీయ ద్వేషంతో తప్పుదోవ పట్టించేదిగా  ప్రేరేపించబడిందని చంపత్‌రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఇప్పటివరకు కొనుగోలు చేసిన అన్ని భూములు బహిరంగ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలకు రాయ్ సమాధానమిస్తూ 2019 నవంబరు 9వతేదీన శ్రీరామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలు భూమిని కొనడానికి అయోధ్యకు రావడం ప్రారంభించారని గుర్తు చేశారు. దీంతో భూముల ధరలు పెరిగాయని చెప్పారు.
 శ్రీరామ జన్మభూమి మందిరపు ప్రదక్షిణా మార్గాన్ని వాస్తు ప్రకారం సరిదిద్దడానికి , చుట్టూరా తూర్పు- పశ్చిమ దిశలలో యాత్రీకులు నడవడానికి అనుకూలంగా ఉండేలా ఖాళీ మైదానం ఉండడానికి,  మందిర రక్షణ కోసం చుట్టుపక్కల ఉన్న మందిరాలను, ఇళ్ళను కొనడం అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు.
ఈ విధంగా కొన్న మందిరాలకు మరొకచోట స్థలం చూపించే ఉద్దేశ్యంతో అయోధ్యలో భూములను కొనడం జరుగుతోందని తెలిపారు. ఇలా భూమి కొనుగోలు వ్యవహారం పరస్పరం మాట్లాడుకోవడం, పరస్పర అంగీకారం మీద జరుగుతోందిని,  పరస్పర అంగీకారం తర్వాత అంగీకారపత్రం మీద సంతకాలు జరుగుతున్నాయని వివరించారు.
ప్రభుత్వ శుల్కం, స్టాంప్  కొనుగోలు ఆన్ లైన్ లో జరుగుతోందని, అంగీకారపత్రంలో ఉన్న విధంగా భూమి ధరను అమ్మకందారు బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. మందిర నిర్మాణంతో పాటు, ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం కూడా అయోధ్య అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున భూమిని కొంటూ ఉండడంతో  ఉన్నట్టుండి భూముల విలువ ఆకాశాన్ని తాకుతోందని చంపత్ రాయ్ తెలిపారు.
పత్రికల్లో చర్చ జరుగుతున్న భూ ప్రదేశం రైల్వేస్టేషన్ కు దగ్గరలోని అతి విలువైన స్థలం అని గుర్తు చేశారు. అయితే,   శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఇప్పటివరకూ భూములన్నింటిని బయట ఉన్న ధరలకంటే అత్యంత తక్కువ ధరలకు కొన్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ భూములు కొనడానికి అమ్మకందారులు అనేక సంవత్సరాలకు ముందే ఒప్పంద పత్రాలు (2011 లో రూ  2 కోట్లకు ) వ్రాసుకుని ఉన్నా, అనేక కారణాలవల్ల కొనుగోలు పత్రాలు వ్రాసుకోలేదని చెప్పారు.
ఈ సంవత్సరపు మార్చి 18న అదే ధరకు కొనుగోలు పత్రం వ్రాసుకున్న తర్వాత తమతో ఒప్పందపత్రం వ్రాసుకోవడం జరిగినదని వివరించారు. 
కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాజకీయ ద్వేషంతోనే ఈ ఆరోపణలు చేశారని రాయ్ మండిపడ్డారు.సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు తేజ్ నారాయణ్ పాండే రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ పై అవినీతి ఆరోపణలు చేసి, దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.