
అదానీ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 25 శాతం వరకు ఆ కంపెనీల షేర్లు పతనమైనట్లు తెలుస్తోంది. అదానీ గ్రూపుకు చెందిన సుమారు రూ 43,500 కోట్ల విలువైన మూడు కంపెనీల విదేశీ నిధులను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సీజ్ చేయడంతో ఆ కంపెనీ షేర్లు పతనం చెందాయి.
డిపాజిటరీ వెబ్‌సైట్ ప్రకారం అల్బులా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్,క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ఫండ్ ఖాతాలుమే 31న లేదా అంతకుముందే వీటిని స్తంభింపజేసినట్టు తెలుస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సరైన సమాచారాన్ని బహిరంగ పరచడంలో ఈ 3 కంపెనీలు విఫలమైనట్టు తెలుస్తోంది.
అయితే, తమ గ్రూపునకు చెందిన మూడు కంపెనీ అకౌంట్లు సీజ్ అయినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూపు ఖండించింది. ఆ వార్తలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఖాతాలను స్తంభింపజేయవచ్చు. నేషనల్ సెక్యూరిటీస్ చర్యలు తీసుకోవడంతో ఈ ఫండ్స్ ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలలో దేనినీ విక్రయించలేవు లేదా కొత్త సెక్యూరిటీలను కొనలేవు. అదానీ గ్రూప్‌లో ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. మారిషస్‌కు చెందిన ఈ మూడుకంపెనీలు అదానీ ఎంటర్ ప్రైజెస్ 6.82 శాతం, అదానీ ట్రాన్మిషన్ 8.03 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5.92 శాతం, అదానీ గ్రీన్ 3.58 శాతం వాటాలులను కలిగి ఉన్నాయి.
అదానీ గ్రూప్ గత ఏడాదిలో 200 శాతం నుంచి 1,000 శాతం మధ్య లాభపడింది. అయితే దీనిపై అదానీ గ్రూప్ ఇంకా స్పందించలేదు. గత ఏడాది సుమారు 800 శాతం దూసుకువెళ్లిన అదానీ గ్రూపు ఇప్పుడు ఒకేసారి బోల్తాకొట్టింది. గత దశాబ్ధ కాలంలో అదానీ షేర్లు పతనం కావడం ఇదే మొదటిసారి. అదానీ పోర్ట్స్ 19 శాతం పతనమైనట్లు నిఫ్టీ పేర్కొన్నది. ఇటీవల అదానీ షేర్లు దూసుకెళ్లడంతో దాని చైర్మెన్ గౌతమ్ అదానీ ఆసియాలో రెండవ సంపన్న వ్యక్తిగా నిలిచారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు గత ఏడాది కాలంలో పది రేట్లు పెరిగాయి.
తాజా వార్తతో స్టాక్‌మార్కెట్లు అదానీ గ్రూపు షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ వాటా 25 శాతం క్షీణించి ఇంట్రాడే కనిష్టానికి 1,201.10 డాలర్లకు చేరుకుంది.దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 1,40,500.74 కోట్లకు పడిపోయింది. అదానీ పోర్టు 19 శాతం క్షీణించి, ఇంట్రాడే కనిష్టానికి 681.50 రూపాయలకు చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ 1,46,444.65 రూపాయలకు పడిపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ , అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం పతనమై లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి.
More Stories
బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ భద్రతపై ప్రశ్నలు!
ఇకపై ఆధార్ అథం టికేషన్ తోనే తత్కాల్ టికెట్లు
20 శాతం రక్షణ బడ్జెట్ పెంచిన పాకిస్తాన్