73.5 శాతం జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి

భారతదేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. ఈ లాక్ డౌన్ సమయంలో భారతదేశంలో జాతీయ రహదారి నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. కేవలం రెండు నెలల్లో అంటే ఏప్రిల్-మే నెలలో దాదాపు 1,470 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగినట్లు రోడ్డు రవాణా ,రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) గత ఏడాది జరిగిన రోడ్డు నిర్మాణంతో పోలిస్తే ఇప్పుడు జరిగిన రోడ్డు నిర్మాణాలు దాదాపు 73.5 శాతం ఎక్కువ. గత సంవత్సరం కూడా ఈ రెండు నెలలు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. 

డేటా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ -మే మధ్య ఎన్‌హెచ్‌ఏఐ 847 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించినట్లు రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.

మరో 663 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు గత నెల చివరి నాటికి ఆమోదించడం జరిగింది. 2020 -2021 ఆర్థిక సంవత్సరంలో, ఎన్‌హెచ్‌ఏఐ సుమారు 4,350 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టులను మంజూరు చేసింది. 

2021- 2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రారంభించాల్సిన హైవే ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2021సంవత్సరం ప్రారంభంలో, ఎన్‌హెచ్‌ఏఐ విజయ్ పూర్,సోలాపూర్ మధ్య 25.54 కిలోమీటర్ల సింగిల్ లేన్ రహదారిని ఎన్‌హెచ్‌ 52 లో కేవలం18 గంటల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదు అయ్యింది.