ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గతంలో పాల్పడిన అవినీతి చర్యలకు సంబంధించి త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ష్టం చేశారు. ఆయనపై గల అవినీతి ఆరోపణల చిట్టాలను బయటకు తీసారని, వాటిపై న్యాయనిపుణులతో కూడా సమాలోచనలు జరిపారని, త్వరలో చర్యలు ప్రారంభం కాగలవని వెల్లడించారు.
‘‘కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పని చేసినప్పుడు కేసీఆర్ అంత అవినీతిపరుడు దేశంలోనే ఎవరూ లేరు. ఆయన అవినీతికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించాం. సహారా, ఈఎ్‌సఐ కేసుల వివరాలు తీస్తున్నం. సదరు అవినీతి చిట్టా చూసి మేమే ఆశ్చర్యపోయాం” అని తెలిపారు.
వాస్తవానికి తెలంగాణ రావడం కేసీఆర్‌కు ఇష్టం లేదని, అందుకే పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు ఆ పార్టీ నేతలు పత్తాకు లేకుండా పోయారని సంజయ్ విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో తాము కుస్తీ పడుతుంటే, దోస్తీ ఎక్కడ ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు రాజకీయ సమాధి తప్పదని, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రాష్ట్రంలో కేసీఆర్, ఒవైసీ కుటుంబాలకు మాత్రమే న్యాయం జరిగిందని మండిపడ్డారు. కరోనా నియంత్రణలో విఫలమైన కేసీఆర్ ప్రజల దృష్టి మళ్లించడానికి రాజకీయ గిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టం చేశారు.
వారం రోజులలో బిజెపిలోకి ఈటెల
ఇలా ఉండగా, ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసిన మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మరో వారం రోజుల్లో బీజేపీలో చేరే అవకాశం ఉందని సంజయ్ వెల్లడించారు. ఈటల రాజేందర్ సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేరుతారని స్పష్టం చేశారు.
కాగా, ఈటల చేరిక అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశం అనంతరం ఈటల మరోసారి వారితో చర్చించారు. అలాగే, బుధవారం పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో్‌షతో ఆయన భేటీ అయ్యారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం
అమెరికా చదువులపై భారత విద్యార్థుల అనాసక్తి