కరోనా మహమ్మారి కాలంలో లక్ష మంది మతం మార్పిడి 

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశం, ప్రపంచం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశంలో మిషనరీలు లక్ష మందిని పైగా మతం మార్చిన్నట్లు గర్వంగా చెప్పుకొంటున్నాయి. పైగా,  ఒక సంవత్సరం వ్యవధిలో 50,000 గ్రామాలను దత్తత తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు.

మిషనరీలు బహిరంగంగా 1 లక్ష మందిని క్రైస్తవ మతంలోకి మార్చడం, భారతదేశంలో గత 25 సంవత్సరాలలో కన్నా ఈ మహమ్మారి కాలంలో సంవత్సర కాలంగా ఎక్కువగా చర్చి లను ఏర్పాటు చేసిన్నట్లు గొప్పగా ప్రగల్భాలు పలుకుతున్నారు. చర్చిలు ప్రారంభించడం, ‘దేవుని వాక్యాన్ని అనువదించడం – ఖచ్చితత్వం,  శ్రేష్ఠతతో’ అంకితం చేసిన సంస్థ అన్‌ఫోల్డింగ్‌వార్డ్ సిఇఓ డేవిడ్ రీవ్స్ ఈ డేటాను ధృవీకరించారు.

మహమ్మారి సమయంలో భారీగా ఉద్యోగాలు కోల్పోవడంతో,  రెండుపూటలా భోజనం లేక, తగినన్ని మందులు  దొరకక ఇబ్బందులకు గురవుతున్న చాలా మంది పేదలు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చుతున్నారు. మిషనరీ నెట్‌వర్క్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ చర్చి తమ నెట్‌వర్క్‌లో తమ భాగస్వాముల్లో ఒకరు భారతదేశంలో సాధించిన ఘనత గురించి వివరణాత్మక నివేదికను వివరించారు. 

లాక్ డౌన్ సమయంలో వారు ఇతరులతో కలవలేక పోవడంతో  తమకు తెలియని వ్యక్తులను కాపాడమని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు, వారు ఆ ప్రార్థనలను ఫోన్, వాట్సాప్ ద్వారా అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఈ విధానం ఫలితంగా లాక్ డౌన్స మయంలో సుమారు ఒక లక్ష మేరకు మత మార్పిడులను జరిపినట్లు వారు అంచనా వేస్తున్నారని రీవ్స్ తెలిపారు.
అదేవిధంగా,  ప్రతి చర్చిని 10 నిర్దిష్ట గ్రామాలు లేదా చర్చ్ లేని పొగరు రుగు ప్రాంతాలకోసం  [ ప్రార్థించమని ప్రోత్సహించారు. అప్పుడు, ఆంక్షలు కొద్దిగా సడలించడంతో, వారు ఈ ప్రాంతాలలోకి ప్రవేశించగలిగారు. లాక్ డౌన్ సమయంలో చర్చిలు సుమారు 50,000 గ్రామాలను దత్తత తీసుకున్నాయని అంచనా వేశారు. ఇప్పుడు  25 శాతం  మందికి ఇప్పుడు సువార్త కోసం ఒక చిన్న ఇళ్లల్లో చర్చిలు  ప్రారంభించారు. 

మిషనరీలు ఒక్క క్రైస్తవుడు కూడా లేని ప్రాంతాలలో కూడా చర్చిలను ప్రారంభించి, నెమ్మదిగా మతం మార్చిన ప్రజలను ఆకట్టుకొంటున్నారు. చాలా ఆసుపత్రులలో అనారోగ్యంతో ఉన్న కుటుంబ రోగుల కోసం ప్రార్థించే సాకుతో క్రైస్తవ పూజారులు, సన్యాసినులు ఒకొక్క పడక వద్దకు వెళ్లి రోగుల కుటుంబాల దుర్బలత్వాన్ని ఆసరాగా చేసుకొని, వారిని ప్రలోభాలకు గురిచేయడం ప్రారంభించారు.
ఒపిండియా నివేదించిన ప్రకారం, భారతదేశంలో ఈ  మిషన్‌తో 110 కి పైగా ఎవాంజెలికల్ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ఆపరేషన్ మ్యాప్‌లతో, సాధించాల్సిన మత మార్పిడి లక్ష్యాలతో, మత మార్పిడి పనులను ప్రోత్సహించడానికి క్రైస్తవులు లేని చోట కూడా కొత్త చర్చిలను నిర్మిస్తున్నారు.

భారతదేశంలోని ప్రతి వర్గంకు సమందించిన వారి జనాభా, వృత్తి ఇతర వివరాలతో కూడిన డేటా రికార్డులను నిర్వహించడం ద్వారా ‘అసంపూర్తిగా ఉన్న వ్యాపారాన్ని’ అపఖ్యాతి పాలైన మిషనరీ సంస్థ జాషువా ప్రాజెక్ట్ ప్రయత్నం చేస్తున్నది. తాము లక్ష్యంగా ఎంచుకున్న జనాభాను మతం మార్చడంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడం ద్వారా `అసంపూర్తిగా ఉన్న లక్ష్యం’ను పూర్తి చేయడం కోసం బ్లూప్రింట్ల గురించి జాషువా ప్రాజెక్ట్ రికార్డులు కూడా ఉన్నాయి.