మాజీ విసి ఆచార్య సింహాద్రి మృతి 

 
మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య యెడ్ల చినసింహాద్రి (వైసీ సింహాద్రి) (74) శనివారం తెల్లవారుజామున కరోనాతో విశాఖపట్నంలో  కన్నుమూశారు. కరోనా సోకడంతో ఆరిలోవలోని అపోలో ఆసుపత్రిలో సింహాద్రి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. 
 
ఆయన భార్యకు కూడా కరోనా సోకి అదే ఆసుపత్రిలో చికిత్స పొంది నాలుగు రోజుల క్రితం కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు.   ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, పాట్నా యూనివర్సిటీలకు ఆయన వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. 
 
ఆంధ్ర యూనివర్సిటీ నుండి సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఆయన అమెరికా, లండన్, జర్మనీ లలో పరిశోధనలు చేశారు.ఐక్యరాజ్య సమితిలో యునెస్కోలో, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీలో కూడా పనిచేశారు.  
 
ఆంధ్ర యూనివర్సిటీ సోషలిజి ప్రొఫెసర్ అయినా ఆయన ఎన్నో అభివఅద్ధి కార్యక్రమాలు చేపట్టారు.  అనేక యూనివర్సిటీలలో విసిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు.  బుల్లయ్య కాలేజీ వద్ద ఉన్న డా.బిఆర్‌.అంబేడ్కర్‌ భవనం నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు. నేపాల్‌ కు చెందిన నాహ్కౌ సింహాద్రిని ఆయనపెళ్ళి చేసుకున్నారు.