కోవిద్ మహమ్మారితో చైనా భారీ వ్యాపారం చేస్తున్నది. భారత్ వంటి దేశాలకు పంపుతున్న అత్యవసర వైద్య సరఫరాల ధరలను అమాంతంగా పెంచేసింది. పైగా, వాటి రవాణాకు అడ్డంకులు కలిగిస్తున్నది. ఈ ధోరణి పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ ప్రైవేట్ వ్యాపారులు చైనా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న అత్యవసర వైద్య సరఫరాల ధరల పెంపును అరికటి భారత దేశంలో కొవిడ్-19 విజృంభణను ఎదుర్కొందేందుకు సాగిస్తున్న పోరాటానికి సహాయపడవలసిందిగా చైనాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
అంతేగాక, వైద్య సరఫరాలు నిరాటంకంగా కొనసాగేందుకు సరకు రవాణా విమానాల సంఖ్యను కూడా పునరుద్ధరించాలని చైనాను భారత్ కోరింది. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు వంటి వైద్య సరఫరాల ధరల పెరుగుదల, భారత్‌కు సరకు రవాణా విమాన సర్వీసులకు అవరోధం ఏర్పడడం వల్ల భారత్‌లో వైద్యానికి సంబంధించిన సరకులు చాలా ఆలస్యంగా చేరుకుంటున్నాయని హాంకాంగ్‌లో భారతీయ కాన్సల్ జనరల్ ప్రియాంక చౌహాన్ తెలిపారు.
భారత్‌కు వైద్య సరఫరాలు నిరంతరాయంగా కొనసాగాలని, వాటి ధరలు స్థిరంగా ఉండాలని తాము కోరుతున్నామని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌కు బుధవారం ఇచ్చిన ఒక ఇంటర్వూలో ఆయన తెలిపారు. సరఫరా-డిమాండ్ మధ్య కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ధరలు మాత్రం స్థిరంగా ఉండాలని ఆమె చెప్పారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో కొంత సహకారం అవసరమని, అయితే ఈ విషయంలో చైనా ప్రభుత్వం ఏ మేరకు ఒత్తిడి తీసుకురాగలదో తాను చెప్పలేనని ఆమె అభిప్రాయపడ్డారు.
కోవిద్ మహమ్మారి ఆందోళనలను ఆసరాగా తీసుకొని చైనా కొవిడ్ సంబంధ, ఔషధాల ముడిసరుకులను అమాంతం పెంచేస్తున్నది. కాదు, కూడదంటే ఔషధ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నది. చైనా సరఫరాదారులు కొవిడ్‌కు సంబంధించిన వస్తువుల ధరలను పెంచారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
సగటున 200 డాలర్ల ధర కలిగిన 10-లీటర్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ ధరను రూ.1000 కు పెంచేశారు. మారు మాట్లాడితే వీటి ధరను రూ.1200 కు పెంచేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొందరు చైనా సరఫరాదారులు గతంలో చేసుకున్న ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేశారు. మిగతా దేశాల సరఫరాదారులు 5 లీటర్ లేదా 8 లీటర్ కాన్సన్‌ట్రేటర్ ధరను 10 లీటర్ కాన్సన్‌ట్రేటర్లకు అందిస్తున్నారు. 2020 లో వెంటిలేటర్ల ధర 6000 డాలర్ల నుంచి 30 వేల డాలర్లకు పెరిగింది.
మరో సమస్య ఏమిటంటే చైనా ప్రభుత్వం సరఫరా కారిడార్లను నిరోధించింది. ప్రభుత్వ విమానయాన సంస్థలు సిచువాన్ ఎయిర్లైన్స్ ను భారతదేశం నుంచి విమాన ప్రయాణాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రికి విన్నవించారు. భారతదేశంలోని 10 నగరాల నుంచి సిచువాన్ ఎయిర్లైన్స్ ప్రయాణాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది.
More Stories
హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీడియాపై 50 శాతం పెరిగిన దాడులు!
సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు