పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఈ నెల 20వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశం కానుంది. ఈ మేరకు గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు.
దీంతో.. శాసనసభా కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఆ మేరకు గెజిట్ను జారీ చేశారు. 20న ఉదయం 9 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
ఆ రోజు ఉదయం 9 గంటలకు రెండు చోట్లా సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కోవిడ్–19 ఉధృతి, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఈ సమావేశాలను ఒక రోజుకే పరిమితం చేయాలా? లేదా మరి కొన్ని రోజులు నిర్వహించాలా అనే విషయంపై శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

More Stories
పిఠాపురం నుంచే జనసేన ప్రక్షాళన కసరత్తు!
మానవ సేవ దైవ సేవ అని చెప్పిన సత్యసాయి
పోలవరం నిర్మాణ తీరును పరిశీలించిన కేంద్ర బృందం