అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం

బీజేపీ సీనియర్‌ నేత, నార్త్‌ ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ కన్వీనర్‌ హిమంత బిశ్వ శర్మ అస్సాం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో రాష్ట్ర గవర్నర్‌ జగదీశ్‌ ముఖి ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు.
 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మణిపూర్ ముఖఅయమంత్రి ఎన్.బీరేన్ సింగ్, నాగాల్యాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడ్డాయి. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్డీయే 75 సీట్లు గెలుచుకోగా, బీజేపీ సొంతంగా 60 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎం హిమంత కేబినెట్‌లో 13 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
అస్సాం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ శర్మ ఆదివారం ట్వీట్ చేస్తూ, “నా మీద మీకున్న భక్తి విశ్వాసం వల్ల కాకపోతే నేను నేనే కాదు. ఈ రోజున, మీ ప్రతి ఒక్కరితో ఎక్కువ అభిరుచి గల అస్సాంతో కలిసి పనిచేయాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ”
 
మరో ట్వీట్‌లో శర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. “నాపై మీ విశ్వాసం కోసం గౌరవ పిఎం శ్రీ నరేంద్ర మోదీ నన్ను ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తున్నాను. ఇది నా జీవితంలో అతి పెద్ద రోజు, నేను మీ ఉదారమైన ఆప్యాయతను ఎంతో పొందుతున్నాను. అస్సాం, ఈశాన్య ప్రాంతాలను మరింత అభివృద్ధి వైపు  తీసుకెళ్లాలనే మీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మేము ఎటువంటి ప్రయత్నం వదిలివేయకుండా కృషి చేస్తామని  నేను మీకు భరోసా ఇస్తున్నాను. ”