స్పుత్నిక్ నుంచి సింగిల్ డోస్ వ్యాక్సిన్‌

ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ నుంచి సింగిల్ డోస్ క‌రోనా వ్యాక్సిన్‌కు గురువారం ర‌ష్యాకు అనుమ‌తి ఇచ్చింది. ఈ విష‌యాన్ని వ్యాక్సిన్ త‌యారీ సంస్థే ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. ఈ వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ లైట్‌. 

దీని సామ‌ర్థ్యం 80 శాతంగా ఉండ‌టం విశేషం. ఇదే విష‌యాన్ని చెబుతూ.. స్పుత్నిక్ ఫ్యామిలీలోకి కొత్త మెంబ‌ర్ వ‌చ్చింది. దీని పేరు స్పుత్నిక్ లైట్‌. ఇది విప్ల‌వాత్మ‌క‌మైన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్‌. 80 శాతం సామ‌ర్థ్యం ఉన్న‌ట్లు తేలింది. 

ఇది ఎన్నో డ‌బుల్ డోస్ వ్యాక్సిన్ల కంటే ఎక్కువ‌. ఈ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ వ‌ల్ల వ్యాక్సినేష‌న్ వేగం పెరుగుతుంది అని త‌యారీ సంస్థ ట్వీట్ చేసింది.

ఈ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సాయం చేసింది. ఈ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. స్పుత్నిక్ లైట్ సామ‌ర్థ్యం 79.4 శాతంగా తేలింది. అదే రెండు డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సామ‌ర్థ్యం మాత్రం 91.4 శాతంగా ఉంది. 

గ‌తేడాది డిసెంబ‌ర్ 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 15 వ‌ర‌కూ ఈ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు. ఇందులో 28 రోజుల డేటాను సేక‌రించి సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేశారు. ఇప్పటి వ‌ర‌కూ స్పుత్నిక్ వి రెండు డోసుల వ్యాక్సిన్‌ను 80 ల‌క్ష‌ల మంది ర‌ష్య‌న్లు తీసుకున్నారు.