బెంగ‌ళూరు, చెన్నైల్లో ప్రమాదకరంగా క‌రోనా  

బెంగ‌ళూరు, చెన్నైలో క‌రోనా కేసులు ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క బెంగ‌ళూరులోనే వారం రోజుల్లో ల‌క్ష‌న్న‌ర పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. బెంగ‌ళూరులో పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువ‌గా ఉంది.

త‌మిళ‌నాడులో 38 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. కోజికోడ్, ఎర్నాకులం, గురుగ్రామ్ జిల్లాల్లో క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని చెప్పారు. దేశంలో క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్లే త‌గ్గి.. పెరుగుతున్నాయ‌ని, క‌రోనా పాజిటివిటీ, మ‌ర‌ణాల‌ రేటు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది అగ‌ర్వాల్ పేర్కొన్నారు. 

12 రాష్ట్రాలు -. మ‌హారాష్ట్ర,  క‌ర్ణాట‌క‌, న్నాయి. 50 వేల కంటే త‌క్కువ కేసులు న‌మోదు అవుతున్నరాష్ట్రాలు  17 ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. 13 రాష్ట్రాలలో రోజుకు వంద మంది చ‌నిపోతున్నారు. మ‌హారాష్ట్ర, , క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, హ‌ర్యానాలో మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నారు.  రోజువారీ క‌రోనా కేసుల్లో 2.4 శాతం పెరుగుల ఉంది. కాగా, మహారాష్ట్రలో కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌క‌పోతే.. వైద్య‌సేవ‌ల నిర్వ‌హ‌ణ మ‌రింత క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌ని హెచ్చరించారు.

కాగా,  గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల్లో సగం కేసులు ఒక్క ఇండియాలో నమోదు అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల్లో ఇండియాలోనే నాలుగో వంతు ఉన్నాయట. బుధవారం నిర్వహించిన వారాంతపు సమీక్షలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.

ఇలా ఉండగా, బుధవారం రాత్రి 8 గంటల వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు 16,24,30,828 డోసులు వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతాల్లో బుధవారం 18-44 ఏళ్లలోపు 2,30,305 మంది లబ్ధిదారులకు మొదటి డోసు వేసినట్లు పేర్కొంది. 

ఇప్పటి వరకు వారికి 9,02,731 మోతాదులు వేసినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 16,24,30,828 మంది లబ్ధిదారులకు టీకాలు వేయగా.. ఇందులో ఆరోగ్య కార్యకర్తల్లో 94,79,901 మందికి మొదటి డోసు.. 63,52,975 మందికి రెండో మోతాదు అందించినట్లు పేర్కొంది.