కోవిద్ ఆరోగ్య సదుపాయాలకు రూ 50 వేల కోట్లు 

కోవిడ్ హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రా వసతులు కల్పించేందుకు రూ.50వేల కోట్ల మేరు నిధులను బ్యాంకుల వద్ద రెపోరేటు వడ్డీతో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.  588 బిలియన్ డాలర్ల రిజర్వ్ ఫారెక్స్ నిధులు, జి-సెక్ ఆప్షన్లు వినియోగంలోకి వస్తాయని పేర్కొన్నారు.  అలాగు 2022 సెకండ్‌ ఆఫ్‌కల్లా అందరికీ టీకాలు లభిస్తాయని చెప్పారు.
 దేశంలో కరోనా మహమ్మారి  ఉధృతి చాలా తీవ్రంగా ఉందని, గత నెలలో పరిస్థితి తీవ్రంగా మారిందని గవర్నర్ చెప్పారు.అయితే కోవిడ్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటుందన్నారు. బలమైన ఆర్థిక పునరుద్ధరణవైపు సాగుతున్న తరుణంలో తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనే స్థితికి మారిందని, ప్రస్తుతం మనం సెకండ్‌వేవ్‌ తో పోరాడుతున్నామన్నారు.   ఈ క్రమంలో వ్యాపారులతో సహా ఇండస్ట్రీలోఅన్ని వర్గాల వారిని ఆదుకునున్నామని శక్తికాంత్‌ భరోసా ఇచ్చారు.
బ్యాంకులకు కోవిడ్‌ లోన్లు, ప్రయారిటీ సెక్టార్‌గా చిన్న ఫైనాన్స​ సంస్థలకు గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.  అత్యవసర ఆరోగ్య సంరక్షణ నిమ్తిం మూడేళ్ల కాలానికిగాను వన్‌టైం లిక్విడిటీ మద్దతు కింద 50 వేల కోట్ల రూపాయలు లభిస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలోవీడియో  ద్వారా వినియోగదారుల  కేవైసీ  అప్‌డేట్‌  సౌకర్యం. కేవైపీ అప్‌డేట్‌ కాని యూజర్లపై ప్రస్తుతానికి  ఎలాంటి  చర్యలుండవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఓడీ ఉపశమనం.. 36 రోజుల నుంచి  50 రోజులకు  గడువు పెంపు ప్రకటించారు.  మార్చి 2022 వరకు ఎన్‌పిఎల కోసం నిర్దిష్ట కేటాయింపు జరుగుతుందని చెప్పారు.

మే 20 న  రెండోసారి  35 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్లు చేయడంతో పాటు సూక్ష్మ, చిన్న ,ఇతర అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం.  చిన్న ఫైనాన్స్ బ్యాంకుల కోసం ప్రత్యేక దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలు.   ప్రస్తుత రెపో రేటుకు 10,000 కోట్లు, రుణగ్రహీతకు రూ .10 లక్షల వరకు తాజా రుణాలు.  అక్టోబర్ 31,2021 వరకు ఈ సదుపాయం ఉంటుందని దాస్ వివరించారు.

సూక్ష్మ, మధ్యతరగతి సంస్థలపై రెండో దశ కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే కరోనాను ఎదుర్కొంటూ ఎలా వ్యాపారం చేయాలో అందరూ నేర్చుకున్నారని అభిప్రాయపడ్డారు. గతంలో రెండు సంవత్సరాల పాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం లభించగలదని దాస్ ప్రకటించారు. 

కరోనా నిబంధనలను, భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యాపారాలు చేయడం అలవాటు చేసుకున్నారన్నారు. తదుపరి ఏడాది ద్రవ్యోల్బణాన్ని స్థానిక లాక్‌డౌన్‌లు, కరోనా వ్యాప్తి ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనవంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. 

కరోనా నివారణ చర్యలతో ద్రవ్యోల్బణం పెరగవచ్చని అంచనా వేశారు.అలాగే  ఫిబ్రవరిలో 5శాతంగా సీసీఐ ఇన్‌ఫ్లేషన్  మార్చి నెలలో  5.5శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. అయితే సాధారణ వర్షపాతం నమోదు  కానుందన్న వాతావరణ శాఖ అంచనాలతో పప్పు దినుసులు, వంటనూనెల ధరలనుంచి ఉపశమం లభించనుందనే  శక్తికాంతదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు