రేపు ప్ర‌ధాన‌మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

రేపు ప్ర‌ధాన‌మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

ప్ర‌తీ నెల చివ‌రి ఆదివారం నాడు ఆకాశ‌వాణి రేడియో ద్వారా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్త‌న్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 25న అంటే రేప‌టి ఆదివారం నాడు ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తార‌ని ఆకాశ‌వాణి, దూర‌ద‌ర్శిని సంయుక్తంగా ప్ర‌క‌టించాయి.

దేశంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న క‌రోనా ప‌రిస్థితుల రీత్యా.. ప్ర‌ధాన మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా క‌రోనా గురించి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, రాబోయే ప‌రిణామాల మీద సంకేతాలు ఉంటాయ‌ని భావిస్తున్నారు. లాక్ డౌన్ అనేది చివ‌రి అస్త్రం మాత్ర‌మే అని ప్ర‌ధాని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. కానీ ప‌రిస్థితులు ఆ దిశ‌గానే వెళుతున్నాయి కాబ‌ట్టి లాక్ డౌన్ మీద కేంద్రం ఆలోచిస్తోంద‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. మ‌రో వైపు టీకా పంపిణీ గురించి కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నందున ప్ర‌జ‌ల‌కు పూర్తి వివ‌రాలు తెలియ‌చేసేందుకు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌య‌త్నిస్తార‌ని అంటున్నారు.