తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీయార్ కు క‌రోనా పాజిటివ్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీయార్ కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ముఖ్య‌మంత్రి లో కొన్ని క‌రోనా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని వెల్ల‌డించారు. హోమ్ ఐసోలేష‌న్ లో కేసీయార్ ఉన్నార‌ని పేర్కొన్నారు. ఉన్న‌త స్థాయిలో వైద్య సేవ‌లు అందిస్తున్న‌ట్లు వివ‌రించారు.