జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ పరీక్షలు వాయిదా

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తాత్కాలికంగా ఏప్రిల్లో నిర్వహించతలపెట్టిన  జేఈఈ మెయిన్ 2021 సెషన్ పరీక్షలను వాయిదా వేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు ప్రకటన విడుదల చేసింది.

ఇంతకు ముందు ప్రకటించిన రెగ్యూలర్ షెడ్యూల్ ప్రకారం, జేఈఈ మెయిన్ 2021 పరీక్షలు ఏప్రిల్ 27, 28 మరియు 30 తేదీలలో నిర్వహించాల్సి ఉంది.

తదుపరి నిర్వహణ తేదీలను 15 రోజుల ముందుగానే ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ ప్రకటనలో పేర్కొంది.

విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షల(JEE Main 2021) నిర్వహణపై ఆందోళన చెందాల్సినపని లేదని ఎన్‌టీఏ తెలిపింది. వారి ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తెసుకున్నట్టు ప్రకటించింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2021 పరీక్షలను నాలుగు దఫాలగా నిర్వహిస్తుంది. ఇప్పటివరకు నిర్వహించిన దాంట్లో మొదటి సెషన్ ఫిబ్రవరి 23-26 ; రెండవ సెషన్ 16-18 మార్చ్లోనే నిర్వహించనట్టు తెలిపింది.

ఈ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు ఏ‌బి‌వి‌పి పేర్కొంది.