ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా వైరస్ సంక్రమించింది. కరోనా పరీక్షలో ఆయన పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
వైరస్ లక్షణాలు తనలో కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, దాని రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చినట్లు ఆదిత్యనాథ్ తన ట్విట్టర్‌లో తెలిపారు. వైద్య చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వర్చువల్ రీతిలో పనులు చేస్తున్నట్లు తెలిపారు.
యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌కు కూడా కరోనా సంక్రమించినట్లు ఇవాళే తన ట్విట్టర్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే.
గత వారం యుపి సర్కార్ ఏప్రిల్ 30 వరకు అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. ప్రతిరోజు 100కి పైగా కొత్త కోవిడ్ కేసులు వచ్చే జిల్లాల్లో రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూలు విధించాలని అధికారులను ఆదేశించింది.
గత 24 గంటల్లో యుపిలో ఒకే రోజు 17,963 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 85 మంది కరోనాతో మరణించారు.

More Stories
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ మెరుపు ధర్నా.. నడ్డా ఆగ్రహం
సిపిజే కార్యకర్తలను తరిమి కొట్టిన గ్రామస్థులు
అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత