ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇటీవల కొవిడ్19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నతీరు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని సమీక్షించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
మార్చి 17న ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం సందర్భంగా ప్రధాని పలు సూచనలు చేశారు. కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడం కోసం వేగవంతంగా, నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు.
ఆదివారం ఇదే అంశంపై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహం అనుసరించాలని ప్రధాని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ నెల 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఉన్నతాధికారులను ప్రధాని ఆదేశించారు.
కాగా, ఏటా తాను విద్యార్థులతో నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 7న ఒక కొత్త వర్చువల్ రూపంలో జరగనున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
మన పరీక్షా యోధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విస్తృతమైన పాఠ్యాంశాలపై అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు, చిరస్మరణీయమైన సంభాషణ ఏప్రిల్ 7న సాయంత్రం 7 గంటలకు పరీక్షా పే చర్చ ఒక కొత్త రూపంలో జరగనున్నది అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన విశేషాలతో కూడిన ఒక వీడియ కూడా ఆయన ట్యాగ్ చేశారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు
మహాకుంభమేళాలో ‘సనాతన బోర్డు’ ముసాయిదా