ఓటర్లను ఆకర్షించేందుకు ప్రతిపక్ష అన్నాడీఎంకే నేతలు డబ్బులు పంచుతున్నారంటూ అధికార అన్నాడీఎంకే ఆరోపించింది. డీఎంకే చీఫ్ స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ సహా పలువురు నేతల అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేయాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కు ఫిర్యాదు చేసింది.
అన్నాడీఎంకే అడ్వకేట్ విభాగం ప్రధాన కార్యదర్శి ఆర్ఎం బాబు మురుగవేల్ ఈ మేరకు ఈసీఐకి ఫిర్యాదు చేశారు. స్టాలిన్ భార్య దుర్గా స్టాలిన్ కొలతూరు నియోజకవర్గంలో తన భర్త తరఫున ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారని, మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ.10,000 ఇచ్చారని మురగవేల్ ఆరోపించారు. స్టాలిన్ సంబంధీకులు ఓటర్లకు జి-పే ద్వారా రూ.5,000 పంపిణీ చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.
తిరుచిరాలపల్లి వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కేఎన్ నెహ్రూ, చెపాక్-తిరువల్లికేని నుంచి పోటీ చేస్తున్న ఉదయనిధి స్టాలిన్, తిరువణ్ణామలై నుంచి పోటీలో ఉన్న ఈవీ వేలు, కాట్పడి నుంచి ఎన్నికల బరిలో ఉన్న దురై మురుగన్‌లు తమ సన్నిహితులు ద్వారా, జీ-పే ద్వారా రూ.2,000 నుంచి రూ.5,000 పంచుతున్నారని కూడా అన్నాడీఎంకే నేత ఫిర్యాదు చేశారు.
నిషేధిత వీడియోలు, క్లిప్పింగులు, ఫూటేజ్ ప్రసారం చేయకుండా సన్ న్యూస్ ఛానెల్‌ను నిలువరించాలని, షోకాజ్ నోటీసు పంపాలని కూడా ఈసీని అన్నాడీఎంకే ఈ ఫిర్యాదులో కోరింది. ఈసీ లెక్కల ప్రకారం తమిళనాడులో ఇంతవరకూ రూ.428.46 కోట్ల రూపాయలు విలువచేసే నగదు, మద్యం, ఇతర సామాగ్రి సీజ్ చేశారు. ఈనెల 6న అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగనుంది. మే 2న ఫలితాలు ప్రకటిస్తారు.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో స్మృతి మంధాన