
తెలుగు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహించింది. శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి, కడపలో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. నిషేధిత మావోయిస్టులతో సంబంధాలు గలవారిని లక్ష్యంగా వివిధ ప్రజా సంఘాలలో పనిచేస్తున్న వారి ఇళ్లల్లో సోదాలు జరిగిన్నట్లు తెలుస్తున్నది.
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. మావోయిస్టులకు సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలపై సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. ఆరుగురిని అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఎన్ఐఏ మరోసారి సోదాలు మావోయిస్టు అగ్ర నేత ఆర్కే భార్య పద్మ ఇంట్లో జరిగాయి. విచారణకు విజయవాడ ఎన్ఐఏ కార్యాలయానికి హాజరుకావాలని ఆమెకు నోటీసులు జారీ చేశారు.
పంగి నాగన్న, అందులూరి అన్నపూర్ణ, జంగిరాల కోటేశ్వరరావు, మణికొండ శ్రీనివాసరావు, రేల రాజేశ్వరి, బొప్పిడి అంజమ్మను అరెస్ట్ చేశారు. 40 సెల్‌ఫోన్లు, 44 సిమ్‌కార్డులు, 70 హార్డ్‌డిస్క్‌లు ఎన్‌ఐఏ సీజ్ చేసింది. మైక్రో ఎస్‌డీ, 180 సీడీలు, 19 పెన్‌డ్రైవ్‌లు, ఆడియో, వీడియో టేప్స్, రూ.10 లక్షలు, పెద్దఎత్తున మావోయిస్టు సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.
More Stories
బనకచర్లపై అందరితో చర్చించాకే నిర్ణయం
బనకచర్లను ఆపేయాలి.. తెలంగాణ ఎంపీలు
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు