దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకేకేతించిన పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలింగ్ నేడు జరుగుతున్నది. ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ఇక్కడి నుండి పోటీ చేయడంతో పాటు, ఆమెకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం ఆమెతో సన్నిహితంగా వ్యవహరించిన సువెందు అధికారి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఈ ఎన్నికపై అందరు దృష్టి సారిస్తున్నారు. పైగా మూడు జిల్లాల్లో రాజకీయంగా సువెందు కుటుంభం ఆధిపత్యం వహిస్తున్నది.
నందిగ్రామ్ సహా 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నందిగ్రామ్‌లో144 సెక్షన్ విధించింది. పోలింగ్ నేపథ్యంలో భద్రతను పెంచేందుకు ఈసీ చర్యలు తీసుకుంది. హెలికాప్టర్ ద్వారా ఎయిర్ సర్వేలెన్స్ ను కూడా ప్రారంభించింది.
నందిగ్రామ్ లో ఓటు హక్కులేని వాళ్లెవరూ నియోజకవర్గంలోకి రాకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పలు ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. 144 సెక్షన్ శుక్రవారం అర్ధరాత్రి వరకూ అమలులో ఉంటుందన్నారు.
దేశమంతా నందిగ్రామ్ వైపే చూస్తోందని బిజెపి అభ్యర్థి సువేందు అధికారి తెలిపారు. తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని చెప్పారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారు అని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశమంతా నందిగ్రామ్ వైపే చూస్తోంది కాబట్టి.. పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
బెంగాల్ రెండో విడత పోలింగ్ లో 24 పరగణాల జిల్లా, బంకూరా, వెస్ట్ మిడ్నాపూర్, ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు 8 విడతల్లో పోలింగ్ జరగనుంది.
ఉదయం 9 గంటల వరకూ పశ్చిమ బెంగాల్‌లో 13.14 శాతం ఓటింగ్ నమోదవగా, ఇదే సమయానికి అసోంలో 10.51 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈ ఓటింగ్ శాతాన్ని చూస్తుంటే సాయంత్రానికల్లా భారీగా ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మొదటి విడత పోలింగ్ మార్చి 27న జరిగింది. చివరగా 8వ విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. ఓట్ల కౌంటింగ్ మే 2న నిర్వహిస్తారు. అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు.
మరోవంక, అస్సాంలో రెండో విడతలో భాగంగా గురువారం 39 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, అపొజిషన్ పార్టీల్లోని ప్రముఖ నేతలు బరిలో ఉన్నా రు. మొత్తం 39 స్థానాల్లో 345 మంది క్యాండిడేట్లు పోటీ చేస్తుండగా, వీరిలో 26మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల్లో అస్సోం గణ పరిషత్‌తో రూలిం గ్ పార్టీ బీజేపీ, ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500