మధ్య బెంగాల్ లో రెండొంతుల సీట్లు బీజేపీవే

* ప్యూపిల్స్ పల్స్ సౌజన్యంతో 
పాకిస్తాన్, బాంగ్లాదేశ్ శరణార్థులు గణనీయ శాఖలో ఉన్న మధ్య బెంగాల్ లో బిజెపి మూడింట రెండొంతుల సీట్లు గెల్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఏడు లోక్ సభ స్థానాలు (కృష్ణ నగర్, రాణాఘాట్, బరధామాన్ పుర, బర్ధమాన్ దుర్గాపూర్, అసన్సోల్, బొల్పూర్, బీర్బహుమ్) ఉండగా, మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 
 
వీటిలో బిజెపి సునాయనంగా 30 సీట్లు గెల్చుకొంటుందని, టిఎంసి 11 సీట్లు గెల్చుకోగా, లెఫ్ట్ ఒక సీట్ గెల్చుకొంటుందని ప్యూపిల్స్ పల్స్ అంచనా వెల్లడిస్తున్నది. మరో 7 సీట్లలో టిఎంసి – బిజెపిల మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు చెబుతున్నారు. 
 
నదియా జిల్లాలో బెంగాలీ హిందూ శరణార్ధుల ఆధిపత్యం కొనసాగుతున్నది. వారిలో ముఖ్యంగా మహిష్యాలు, జీవాల ఘోష్, భద్రలోక్ లు ఎక్కువగా ఉన్నారు. తూర్పు పాకిస్థాన్ నుండి వలస వచ్చిన నమోశూద్ర/మాటువ దళితులు కూడా ఉన్నారు. వీరితో పాటు స్థానిక ముస్లింలు ఉన్నారు. 
 
రెండు లోక్ సభ నియోజకవర్గాలున్న బీర్బహుమ్ ప్రాంతంలో హిందూ బెంగాలీలు, ముస్లింలు, షెడ్యూల్డ్ కులాల వారు ఎక్కువగా ఉన్నారు. కొన్ని చోట్ల సంథాల్, ముండా, ఒరన్ గిరిజనులు ఉన్నారు. రెండు లోక్ సభ స్థానాలున్న పశ్చిమ బార్డహ్మన్ ప్రాంతంలో హిందీ భాషీలు, హిందూ బెంగాలీలు, చైన్ మండల్, బాఘ్దిలు వంటి షెడ్యూల్డ్ కులాల వారితో పాటు ముస్లింలు, కొద్దిమంది ఆదివాసీయులు కూడా ఉన్నారు. 
 
ఇక, తూర్పు బార్డహ్మన్ ప్రాంతంలో ఆగురిలు, మహిష్యాలు, ఘోష్, భద్రలోక్ వంటి బెంగాలీ హిందువులు; బాఘ్దిలు వంటి ఎస్సిలు, ముస్లింలు ఉన్నారు. హిందువులలో త్యధికులు తృణమూల్ వ్యతిరేకతతో ఉండగా, ముస్లింలు మొత్తంగా తృణమూల్ వెనుక సమీకృతం అవుతున్నారు. ముఖ్యంగా నదియా జిల్లాలో ఎసిలో తృణమూల్ వ్యతిరేకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. 
 
అవినీతి, నిరుద్యోగం, రాజకీయ హింస కారణంగా ప్రధానంగా హిందువులలో అత్యధికులు తృణమూల్ కాంగ్రెస్ కు దూరం అయిన్నట్లు స్పష్టం అవుతున్నది. ముఖ్యంగా బిర్భుమ్, బార్డహ్మన్ ప్రాంతాలలో ఇసుక మాఫియా, స్టోన్ మాఫియా ప్రత్యామ్న్యాయ ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్నాయి. 
ఇక, అధికార పార్టీకి సన్నిహితమైన సిండికెట్ లు నడుపుతున్న బొగ్గు, తుక్కు ఇనుము, ఇసుల సంబంధం అవినీతి కారణంగా అధికార పక్షం పట్ల ఆగ్రవేశాలు వెల్లడి అవుతున్నాయి. 
 
ఇక నదియా జిల్లాలో, సరిహద్దు అవతలి నుండి నిరాటంకంగా జరుగుతున్న బంగారం, మందులతో పాటు ఆవుల స్మగ్గ్లింగ్ వ్యాపారం తీవ్రమైన అవినీతికి, ఆధిపత్య ధోరణులకు, హింసకు దారితీస్తుంది. పశ్చిమ బెంగాల్ అంతటా నెలకొన్న సాధారణ అవినీతితో పాటు ఈ ప్రాంతంలో ఈ రంగాలలో ప్రత్యేకంగా అవినీతి ప్రజల నిత్యజీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. 
 
ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉన్నప్పటికీ బిర్భుమ్ ప్రాంతంలో 37 శాతం, పశ్చిమ బార్డహ్మన్ , ప్రుబాబార్డహ్మన్ ప్రాంతంలో 20.7 శాతం, నదిలో 26.8 శాతంగా గల మద్దతు తృణమూల్ కాంగ్రెస్ కు కీలకంగా మారనున్నది. 60 నుండి 70 శాతంకు పైగా హిందువుల జనాభా ఉండడంతో బిజెపి కి బలమైన రాజకీయ మద్దతు లభిస్తున్నది.