మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు విశ్వసనీయ సమాచారం వెల్లడైంది.
గడ్చిరోలి జిల్లాలోని కోబ్రామెడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఇవాళ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డారు. వారికీ ధీటుగా ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు
మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలించగా ఐదు మృతదేహాలు లభ్యమైనట్లు తెలిసింది. ఈ ఘటనలో మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఘటనా ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Stories
కర్ణాటక ఆలయాల్లోని విరాళాల పెట్టెలపై సీసీటీవీ నిఘా
గురుగ్రామ్ ఎన్కౌంటర్లో 60 రౌండ్ల ఫైరింగ్.. నలుగురు గ్యాంగ్స్టర్లు మృతి
షుగర్ బాధితులకు వారానికి ఒక్క ఇంజెక్షన్ చాలు!