స‌చిన్ టెండూల్క‌ర్ ‌కు క‌రోనా పాజిటివ్‌

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌, మాజీ టీమిండియా క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. క‌రోనా సోకిన స‌చిన్ క్వారెంటైన్‌లో ఉన్న‌ట్లు ఇవాళ ఉద‌యం త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. 

ఇటీవ‌ల నిత్యం క‌రోనా టెస్టింగ్ చేయించుకుంటూనే ఉన్నాని, కోవిడ్‌కు దూరంగా ఉండేందుకు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు ఆ ట్వీట్‌లో స‌చిన్ తెలిపారు. అయితే తాజాగా నిర్వ‌హించిన టెస్టింగ్‌లో క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు స‌చిన్ పేర్కొన్నారు. స్వ‌ల్పంగా త‌న‌కు ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు తెలిపారు. 

ఇంట్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా ప‌రీక్ష‌లో నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు ఆయ‌న చెప్పారు. క‌రోనా సోక‌డం వ‌ల్ల ఇంట్లోనే క్వారెంటైన్‌లో ఉన్న‌ట్లు త‌న ట్వీట్‌లో స‌చిన్ వెల్ల‌డించారు.

డాక్ట‌ర్లు ఇచ్చిన సూచ‌న‌ల ప్ర‌కార‌మే అన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తున్న‌ట్లు మేటి క్రికెట‌ర్ తెలిపారు. త‌న‌తో పాటు, దేశంలోని అనేక మందికి మ‌ద్ద‌తు ఇస్తున్న హెల్త్‌కేర్ ప్రొఫెష‌న‌ల్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నాన‌ని స‌చిన్ త‌న ట్వీట్‌లో తెలిపారు.

బాలీవుడ్‌ నటుడు పరేశ్‌ రావల్‌ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం రాత్రి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. గత పది రోజుల్లో తనను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. 

65 సంవత్సరాల పరేష్‌ రావల్‌ మార్చి 9న కొవిడ్‌ తొలి డోస్‌ తీసుకున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ వారంలో అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, రోహిత్ సరఫ్, కార్తీక్ ఆర్యన్ వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే.

కాగా, దేశంలో రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. నిన్నటి వరకు 50వేలకుపైగా రికార్డవగా.. శనివారం రెండు స్థాయిలో నమోదయ్యాయి. గత నాలుగు రోజుల్లో రెండు లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 కొత్తగా 62,258 కొవిడ్ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.