క‌బడ్డీ స్టేడియంలో ప్ర‌మాదం.. స‌హ‌య‌క చ‌ర్య‌ల్లో స్వ‌యంసేవ‌కులు

తెలంగాణ: సూర్యాపేట జిల్లా వేదికగా మార్చి 22న జ‌రిగిన జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీల ప్రారంభ వేడుక‌ల్లో ప్ర‌మాదం జ‌రిగింది. ప్రేక్ష‌కులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాల‌రీ ఒక్క సారిగా కుప్ప‌కూడంతో వంద‌ల మంది గాయాల పాల‌య్యారు.

తీవ్ర గాయాల‌తో బాధ‌ప‌డుతున్నవారిని పోలీసులు, వైద్య సిబ్బంది క‌లిసి స్థానిక ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం గురించి స‌మాచారం అందుకున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌ స్వ‌యంసేవ‌కులు వెంట‌నే స్పందించి ఆస్ప‌త్రికి చేరుకున్నారు.

ఆస్ప‌త్రి ద‌గ్గ‌ర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ట్రాఫిక్‌ నియంత్రణలో స్వ‌యంసేవ‌కులు కృషి చేశారు. మరి కొంతమంది స్వయంసేవకులు క్ష‌తగాత్రుల‌ను స్ట్రేచ‌ర్‌పై ఆస్పత్రిలోని 2వ అంతుస్థులోకి తీసుకెళ్లారు. తీవ్ర స్థాయిలో గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌డానికి వారి కుటుంబ స‌భ్యులు అందుబాటులో లేకపోవ‌డంతో ఆర్.ఎస్.ఎస్ స్వ‌యంసేవ‌కులు స్వయంగా వారి వెంట వెళ్లి చికిత్స చేయించారు. ఆస్ప‌త్రిలో బాధితుల కుటుంబ స‌భ్యుల‌కు వాట‌ర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, అర‌టి పండ్ల‌ను కూడా స్వ‌యం సేవ‌కులు స‌మ‌కూర్చారు.