రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తెలుగు అకాడమీ ఉద్యోగుల ఆస్తుల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగుల పంపకం, ఆస్తులు, అప్పులపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది.
విభజన చట్టం 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ విభజన అంశం న్యాయపరిధిలోకి రాదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ పిటిషన్ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం విచారించింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే కేంద్రం జోక్యం చేసుకునేలా చట్టంలో ఉందని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ వాదించారు.
ఇరు రాష్ట్రాలు నెల రోజుల్లో తెలుగు అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు సూచించింది. తెలుగు అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే అప్పడు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది.

More Stories
హిల్ట్ పాలసీపై నిలిపివేయాలని గవర్నర్ కు బిజెపి వినతి
ముఖ్యమంత్రి రేవంత్ కు ఎన్నికల్ కోడ్ వర్తించదా?
బిజెపి నేత సవాల్ కు ముఖం చాటేసిన మంత్రి ఉత్తమ్