రామమందిర నిర్మాణం భవ్యమైన భారత్ కు మార్గం 

అయోధ్యలో మహోన్నతమైన శ్రీ రామ్ జన్మభూమి నిర్మాణంతో పాటు, శ్రీ రాముని విలువలతో ప్రేరణ పొందిన సామాజిక, జాతీయ జీవితం సమిష్టి సంకల్పం,   ప్రయత్నాల ద్వారా బలమైన,  అద్భుతమైన భారత్ నిర్మాణానికి మార్గం చూపుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విశ్వాసం వ్యక్తం చేసింది.

బెంగుళూరులో జరిగిన రెండు రోజుల అఖిల భారత ప్రతినిధి సభలలో ఆమోదించిన తీర్మానంలో ఈ నిర్మాణం మొత్తం ప్రపంచం శ్రేయస్సును నిర్ధారిస్తుందని స్పష్టం చేసింది.

రామమందిర నిర్మాణం కోసం ప్రచారం మొత్తం దేశం ఎల్లప్పుడూ శ్రీ రామ్‌తో భావోద్వేగంతో అనుసంధానించబడిందని మరోసారి రుజువు చేసిందని పేర్కొన్నాడు. శ్రీరాముని ఆదర్శాలు సమాజంలో విస్తరించే విధంగా సామాజిక, మత సంస్థలు, విద్యావేత్తలు మరియు దేశ మేధావులతో సహా శ్రీ రామ భక్తులు అందరికి ఈ సందర్భంగా పిలుపిచ్చింది. 

గౌరవనీయమైన సుప్రీంకోర్టుపై శ్రీ రామ జన్మభూమిపై ఏకగ్రీవ తీర్పు వెలువరించిన తర్వాత శ్రీ రామ మందిరం నిర్మాణం కోసం  “శ్రీ రామ్‌జన్‌భూమి తీర్త్ క్షేత్రం” ఏర్పడటం, భవ్యమైన మందిరం నిర్మాణాన్ని ప్రారంభించే పవిత్ర కార్యక్రమం కోసం నిధిసమర్పన్ ప్రచారం  భారత్ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖియింపదగిన ఘటన అంటూ, ఇది రాబోయే తరాలకు కూడా స్ఫూర్తినిస్తుందని ఆర్ ఎస్ ఎస్ తెలిపింది.

ఈ కార్యక్రమం ద్వారా సహజమైన భారత్  అంతర్గత బలం వ్యక్తీకరణ జరిగినదని,  ఈ కార్యక్రమాలు ఆధ్యాత్మిక మేల్కొలుపుకు, జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యం, సద్భావన, అంకితభావానికి ప్రత్యేక చిహ్నంగా మారాయని ఎబిపిఎస్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
భద్రాపద్ కృష్ణ ద్వితేయ, యుగబ్ద 5122 (5 ఆగస్టు 2020) లో, గౌరవ   ప్రధాని, ఆర్ఎస్ఎస్ పూజనీయ సర్ సంఘ్ చాలక్,   శ్రీ రామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ కు చెందిన తృస్తీలు, ధర్మాచార్యుల సమక్షంలో ప్రారంభమైన దేవాలయ నిర్మాణ పనులను మొత్తం ప్రపంచం చేసినదాని వివరించింది.


ఈ కార్యక్రమానికి అన్ని తీర్ధ క్షేత్రాల నుండి మట్టిని, దేశంలోని అన్ని పవిత్ర నదుల నుండి నీటిని తీసుకు వచ్చారు. 
కోవిడ్ 19 మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో నెలకొన్న అన్ని నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, ఈ సమావేశాన్ని పరిమితంగా నిర్వహించారు. అయితే దాని ప్రభావం అపరిమితంగా ఉందని, భౌతిక ఉనికి పరిమితమైనా,  మొత్తం హిందూ సమాజంకు వర్చువల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమం చేరినదని తీర్మానంలో వివరించారు. ఈ సంఘటనను సమాజంలోని అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా స్వాగతించాయని పేర్కొన్నారు.

భారత్ మొదటి పౌరుడు గౌరవప్రదమైన అధ్యక్షుడి నుండి, మకర సంక్రాంతి పవిత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని భగవాన్ వాల్మీకి మందిర్ వరకు  44 రోజుల నిడివిగల “నిధిసంపర్క్ అభియాన్” నిజంగా ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ప్రచార కార్యక్రమమని తెలిపింది. సుమారు 5.5 లక్షల నగరాలు, గ్రామాల నుండి 12 కోట్లకు పైగా రాంభక్త్ కుటుంబాలు భవ్యమైన మందిర్ నిర్మాణానికి సహకరించాయని తెలిపింది. 

సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రచారంలో పాల్గొన్నాయి. ఈ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి గ్రామీణ, పట్టణాల నుండి అటవీ, పర్వత ప్రాంతాల ప్రజలు, ధనికుల నుండి సాధారణ ప్రజల వరకు హృదయపూర్వకంగా సహకరించారు. ఈ అసమానమైన ఉత్సాహం, మద్దతు ప్రదర్శించిన రామభక్తులు అందరిని ఎబిపిఎస్ ఈ సందర్భంగా అభినందించింది.