
రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని కోరుతూ ఏపీ సిఐడి అధికారులు జారీచేసిన నోటీసులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
ని సుధీర్ఘంగా నేతలు, న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత సీఐడీ దాఖలు చేసిన కేసులపై చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎఫ్ఐఆర్‌లు రద్దు చేయాలని కోరుతూ పిటిషిన్‌లో కోరారు. ఎఫ్ఐఆర్‌లు సవాల్ చేస్తూ చంద్రబాబు, నారయణ తరఫు సీనియర్ న్యాయవాదులు ఇవాళ మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను దాఖలు చేయడం జరిగింది. 41ఎ కింద నోటీసులు ఇచ్చి సోదాలు చేస్తున్నారని న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇది చట్ట, న్యాయ విరుద్ధమని, ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని కోర్టును న్యాయవాదులు కోరారు. రేపు అనగా శుక్రవారం ఉదయం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
మోసం, కుట్రతో అసైన్డ్ భూములు లాక్కొన్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత 24న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు, నారాయణపై ఎస్సీ, ఎస్టీ చట్టం సహా 10 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు ఈ నెల 12న కేసు నమోదు చేశారు.
More Stories
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు
తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు
గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం