‘లవ్ జిహాద్’ పై కరాటే కల్యాణి ఫైట్

సినీ నటి కరాటే కల్యాణి మరో పోరాటానికి సిద్ధమయ్యారు. క్యాస్టింగ్ కౌచ్, రామతీర్థం ఘటనలపై ఆమె ఇప్పటికే పోరాటాలు చేశారు. ఇప్పుడు తాజాగా లవ్ జిహాద్‌కు గురైన ఓ అమ్మాయికి న్యాయం చేయాలని గట్టిగా పోరాడుతున్నారు.
 
ఇందులో భాగంగా లవ్‌జిహాద్ పై రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఆడపిల్లలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
దివ్య అనే హిందూ అమ్మాయి లవ్ జిహాద్‌కు గురైందని, తాసీఫ్ అనే వ్యక్తి దివ్యను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారని ఆమె ఆరోపించారు. పెళ్లి చేసుకున్న తర్వాత తనను చిత్ర హింసలకు గురి చేశారని, ఇప్పుడు తలాక్ అని చెప్పి, వెళ్లిపోయారని తీవ్రంగా మండిపడ్డారు. తాసీఫ్ ఎక్కడున్నా, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్యాణి డిమాండ్ చేశారు.