భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమేనని అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అయితే, ఇంధన ధరలపై విధించిన పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
“అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదల కారణంగా భారతదేశం కూడా ఇంధన ధరలను పెంచవలసి వచ్చింది. కానీ, ఇది తాత్కాలికం త్వరలో క్రమంగా ధరలు తగ్గుతాయి” అని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం కోసం ఇంధనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలపై పన్నులను విధిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పెట్రోలియం ధరపై కేంద్రం మాత్రమే సుంకాలు విధించడం లేదని, రాష్ట్రాలు కూడా సుంకాలు విధిస్తున్నాయని గుర్తు చేసారు.
కాబట్టి రాష్ట్రాలు, కేంద్రం ఈ విషయమై చర్చించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. కేంద్రం వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

More Stories
నిబంధనల ఉల్లంఘనల సాకుతో భీమా పరిహారం ఎగవేత కుదరదు!
త్వరలో భారత్కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
అమెరికా ఆంక్షలతో రష్యా చమురుకు చెల్లింపు సమస్యలు!