కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. రాజీనామా విషయమై తన అనుచరులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ఆదివారం ఎమ్మెల్సీ పోలింగ్ ముగియడంతో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీలో చేరబోతున్నట్లు అనుచరులతో చెప్పారు. బీజేపీ వైపు కొండా ఎప్పచూస్తున్నట్లు టి నుంచో నెలకొన్న ఊహాగానాలకు తెరపడిన్నట్లు అయింది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి చేవెళ్ల నుంచి పోటీ చేయగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
అధికార పార్టీ టీఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యమని పలు వేదికలపై ప్రకటించిన ఆయన సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై తనదైన శైలిలో నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో ముందుంటారు. తెలంగాణ రాజకీయాల్లో కొండా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడటంలో కాంగ్రెస్ నాయకత్వం అనుసరిస్తున్న ధోరణులపై కొంతకాలంగా అసంతృత్తిగా ఉంటూ వస్తున్నారు.
More Stories
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు