“విమాన ప్రయాణాన్ని చేపట్టే కొంతమంది ప్రయాణికులు ‘కోవిడ్ -19 ప్రోటోకాల్’లకు కట్టుబడి ఉండట్లేదు. విమానాశ్రయం నుంచి ప్రయాణికులు రాకపోకలు చేసే సమయంలో , విమానాశ్రయంలో ఉన్నంతసేపు అన్ని సమయాల్లో మాస్క్‌లను కచ్చితంగా ధరించాల’ని డీజీసీఏ పేర్కొంది.
విమానశ్రయ ప్రాంగణంలో కొంతమంది భౌతికదూరాన్ని పాటించడం లేదని తెలిపింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణీకులు మాస్క్‌లను తీయవద్దని డీజీసీఏ సూచించింది. విమానశ్రాయ ఎంట్రీలో మోహరించిన సిఐఎస్ఎఫ్ , ఇతర పోలీసు సిబ్బంది మాస్క్ ధరించకుండా ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరీనీ అనుమతించకుండా చూసుకోవాలని తెలిపింది.
ఈ విషయాన్ని వ్యక్తిగతంగా భద్రత , తనిఖీ అధికారులు,ఇతర పర్యవేక్షక అధికారులు చూడాలని డీజీసీఏ కోరింది.విమానాశ్రయ ప్రాంగణంలో ప్రయాణీకులు సరిగ్గా మాస్క్‌లు ధరించేలా చూడాలని, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని విమానాశ్రయ డైరెక్టర్, టెర్మినల్ నిర్వాహకులను డీజీసీఏ కోరారు. ఒకవేళ, ఎవరైనా ప్రయాణీకులు “కోవిడ్ -19 ప్రోటోకాల్” ను ఉల్లంఘింస్తే హెచ్చరికలను జారీ చేయాలని, తరువాత కూడా వినకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది.

More Stories
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు
నిబంధనల ఉల్లంఘనల సాకుతో భీమా పరిహారం ఎగవేత కుదరదు!
త్వరలో భారత్‌కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల