ఈ నెల 12న జరగనున్న క్వాడ్ సదస్సులో నాలుగు దేశాధినేతలు భేటీ కానున్నారు. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగా, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ వర్చువల్‌గా ముఖాముఖి చర్చ జరపనున్నారు. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్ తొలిసారిగా ఈ సదస్సులో పాల్గొననున్నారు.
క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారని ప్రకటించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ… ప్రాంతీయ, ప్రపంచ సమస్యలతో పాటు ఇండో- పసిఫిక్ ప్రాంతంపై నిర్వహణ, స్వేచ్ఛాయుత సహకారం వంటి ఆచరణాత్మక రంగాలపై తమ అభిప్రాయాలను… ఇతర దేశాధినేతలతో పంచుకుంటారని పేర్కొంది.
సమకాలీన సవాళ్లైన… అభివృద్ధి చెందుతున్న, క్లిష్టమైన సాంకేతిక, మారిటైం భద్రత, వాతావరణ మార్పులు వంటి అంశాలపౖౖె ఈ నలుగురు అగ్ర దేశాధినేతలు చర్చించుకునేందుకు ఈ శిఖరాగ్ర సమావేశం ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది.
కోవిడ్-19 ఎదుర్కోవడంతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సురక్షితమైన, సరమైన ధరలకు వ్యాకిన్లను అందించేందుకు సహకారం కోసం అవకాశాలను అన్వేషించేందుకు నలుగురు దేశాధినేతలు చర్చించనున్నారు.
More Stories
ఇజ్రాయిల్ నగరాలపై రాకెట్ల వర్షం
సరిహద్దుల్లోకి డ్రాగన్ డ్రోన్లు.. నిఘా కోసమేనా?
వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం