
అలాగే లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో సైతం ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. మోసపూరితంగా గానీ, బలవంతంగా గానీ, భయపెట్టిగానీ, ఏదైనా ప్రలోభంతో గానీ పెళ్ళి పేరుతో మతమార్పిడికి పాల్పడడం ఈ చట్టరీత్యా నిషేధం. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
‘‘మధ్య ప్రదేశ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్ 2021’’ఆమోదం అనంతరం బీజేపీ శాసనసభ్యులు సభలో ‘జై శ్రీరాం’నినాదాలు చేశారు. అంతకు ముందు జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ తాము లవ్ జిహాదీ కోసం ‘రఫీక్ని రవిగా’మారనివ్వమని స్పష్టం చేశారు.
తాము ‘లవ్’ (ప్రేమ)కు వ్యతిరేకులం కాదని, `జిహాద్’కి మాత్రమే వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో సీఏఏని వ్యతిరేకించినట్టే, ఆర్టికల్ 370ని వ్యతిరేకించినట్టే కాంగ్రెస్ ఈ బిల్లుని సైతం వ్యతిరేకించిందని ఆయన ఎద్దేవా చేశారు. .
More Stories
ఆర్ఎస్ఎస్ అంకితభావం, సేవకు అరుదైన ఉదాహరణ.. దలైలామా
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
ఐఎస్ఐ కోసం గూఢచర్యంలో యూట్యూబర్ వసీం అరెస్ట్