
‘మెట్రో మ్యాన్’ ఇ శ్రీధరన్ లాంఛనంగా బిజెపిలో చేరారు. కేరళ బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ చేపట్టిన విజయ యాత్ర గురువారం రాత్రి చంగలంకుళం చేరుకున్న సందర్భంగా జరిగిన ఒక సమావేశంలో 88 సంవత్సరాల శ్రీధరన్ బిజెపిలో చేరినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
బిజెపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీధరన్‌కు పూలమాల వేసి సురేంద్రన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ ఇది తన జీవితంలోనే గొప్ప సందర్భమని చెప్పారు.
బిజెపి కోసం పనిచేసే అవకాశాన్ని తనకు కల్పించినందుకు సురేంద్రన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మెట్రో మ్యాన్‌గా ప్రసిద్ధులైన శ్రీధరన్ తాను బిజెపిలో చేరనున్నట్లు గత వారం ప్రకటించారు. ఏప్రిల్-మేలో జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఆయన వెల్లడించారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు