తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 6న ఎన్నికలు 

నాలుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి లలో  ఒకే దశలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాంలో మూడు దశలలో, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది దశలలో ఎన్నికలు జరుపుతారు. అన్ని రాష్ట్రాలలో ఓట్లలెక్కింపు మే 2న జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. తిరుపతి లోక్ సభ స్థానంకు కూడా ఉపఎన్నిక జరుగుతుంది. 

అస్సాంలో 3 దశల పోలింగ్

అస్సాం అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మార్చి 2న ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని, నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 9 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇక మార్చి 10న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, మార్చి 27న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్‌ 1న రెండోదశ పోలింగ్‌‌, ఏప్రిల్‌ 6న మూడోదశ పోలింగ్‌ జరుగుతుందని.. మే 2న కౌంటింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.

కేరళలో, తమిళ నాడు, పుదుచ్చేరి ల్లో ఏప్రిల్‌ 6న 

తమిళనాడు, కేరళ పుదుచ్చేరిలలో ఒకే దశలో పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్‌ 6న పోలింగ్‌.. మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. అదేవిధంగా ఏప్రిల్‌ 6న కేరళలోని మల్లాపురం లోక్‌సభ ఉప ఎన్నిక నిర్వహిస్తారు.

పశ్చిమ బెంగాల్‌ 

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో పోలింగ్‌ నిర్వహణ. మొదటి దశ పోలింగ్‌ మార్చి 27న, రెండో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 1న, మూడో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 6న, నాల్గొవ దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 10, ఐదో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 17, ఆరో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 22, ఏడో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 26, ఎనిమిదో దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 29న జరగనుంది. ఈ ఎనిమిది దశల పోలింగ్‌ కౌంటింగ్‌ను మే 2న చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. 

మొత్తంగా త్వరలో జరగబోయే ఐదు అసెంబ్లీల్లో 824 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగనున్న పరిధిలో 18.68 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 2.7 లక్షల సిబ్బందిని వినియోగించనున్నట్లు ఈసీ ప్రకటించింది. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఎన్నిక‌ల పోలింగ్ టైం ఒక గంట పెంచుతున్న‌ట్లు శుక్ర‌వారం ప్ర‌క‌టించింది

 క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఐదు రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లోనూ తమ‌ నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించొచ్చున‌ని కేంద్ర ఎన్నిక‌ల ప్రధాన క‌మిష‌న‌ర్ సునీల్ అరోరా తెలిపారు. ఆన్‌లైన్‌లో నామినేష‌న్ ప‌త్రాల‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారు వాటిని నింపి, ఆన్‌లైన్లో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. త‌దుప‌రి ఎన్నిక‌ల రిటర్నింగ్ అధికారికి ఆ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలి. ‌ 

పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు, తమిళనాడులోని 234 అసెంబ్లీ  స్థానాలకు, కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు, అసోంలోని 126 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఎన్నికల్లో ఇంటింటికి ప్ర‌చారాన్ని ఐదుగురికి ప‌రిమితం చేయాల‌ని రాజకీయ పార్టీలను  ఆదేశించారు. ప్ర‌శాంతంగా ఎన్నిక‌లు నిర్వహించేందుకు కేంద్ర పారామిలిట‌రీ బ‌ల‌గాల‌ను నియ‌మిస్తామ‌ని పేర్కొన్నారు.  పోలింగ్ స్టేష‌న్ల‌ను గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేస్తామ‌ని ఆయన స్పష్టం చేశారు.