నేపాల్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించిన సుప్రీం కోర్ట్ 

నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వం రద్దు చేసిన నేపాల్‌ ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ.. నేపాల్‌ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. 275 మంది సభ్యులున్న దిగువ సభను రద్దు చేస్తున్నట్లు గతంలో ఓలి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రద్దు నిర్ణయాన్ని సవాలు చేయడంతో పాటు 13 రోజుల్లో సభను తిరిగి సమావేశపరచాలని కోరుతూ 13 రిట్‌ పిటిషన్‌లు దాఖలయ్యాయి.
 
ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చోలేంద్ర షుంషర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక రాజ్యాంగ సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది. 13 రోజుల్లోపు సభను తిరిగి పునరుద్ధరించాలని ఆదేశించింది. సభ రద్దును వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నేపాల్‌ మాజీ ప్రధాని మాధవ్‌కుమార్‌ నేపాల్‌ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిందని హర్షం ప్రకటించారు. సభను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం ఆదేశించింది. 
 
నేపాల్‌ ప్రధాని ఓలి ప్రతిపాదన మేరకు నేపాల్‌ అధ్యక్షుడు బైద్య దేవ్‌ భండారీ గతేడాది డిసెంబరు 20న లోక్‌ సభను రద్దు చేశారు. ఏప్రిల్‌ , మే నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ నేతఅత్వంలోని ఓలీ వ్యతిరేక వర్గం సుప్రీంను ఆశ్రయించింది.
 
అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ స్టాండింగ్‌ కమిటీలో ఓలిని ఆయన సహచరులు సవాలు చేయడంతో పాటు ప్రత్యర్థి వర్గం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.