అసోంలో 1,040 మిలిటెంట్ల లొంగుబాటు

అసోంలో తీవ్రవాదానికి స్వస్థి చెప్పిన 1039 మంది మిలిటెంట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. అసోంలో ఐదు తీవ్రవాద సంస్థలకు చెందిన 1039 మంది మిలిటెంట్లు తుపాకులను అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కు అప్పగించి లొంగిపోయారు.
 
పీపుల్స్ డెమోక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ కర్బీ లాంగ్రీ, కర్బీ లాంగ్రీ ఎన్సీ హిల్స్ లిబరేషన్ ఫ్రంట్, కర్బీ పీపుల్స్ లిబరేషన్ టైగర్, కూకి లిబరేషన్ ఫ్రంట్, యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సంస్థలకు చెందిన 1039 మంది లొంగిపోయారు. 
 
బోరోలాండ్ లోని నిషేధిత నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ కమాండర్ సాంగ్ బిజిత్ లొంగిపోయిన వారిలో ఉన్నారు. బోడోలాండ్ జిల్లాలో బిజిత్ మైనారిటీలపై పలు దాడులకు పాల్పడ్డారు. 
 
జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోయిన తీవ్రవాదులకు అసోం సీఎం సోనోవాల్ స్వాగతం పలికారు. అసోంను తీవ్రవాదం నుంచి విముక్తి చేస్తామని సీఎం సోనోవాల్ ప్రకటించారు.