గుజరాత్‌లో జరిగిన ఆరు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఫలితాలు వెల్లడవుతున్నాయి. వడోదర, రాజ్‌కోట్, జామ్‌నగర్ మున్సిపాల్టీల్లో ఇప్పటికే బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఆ మూడు మున్సిపాల్టీల్లో బీజేపీ స్వీప్ చేసింది.
ఆరు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు కైవలం చేసుకుని తన ఏకచత్రాధిపత్యాన్ని నిలుపుకుంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పూర్తిగా చతికిలబడిపోయింది. అతి తక్కువ స్థానాలు గెలుచుకుని తన ప్రభావాన్ని మరింత కోల్పోయింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం సూరత్ మున్సిపాలిటీలో 27 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకుని గుజరాత్ లోకి ప్రవేశించింది.
మొత్తం 576 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు 404 స్థానాల తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా 341 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 38 స్థానాలతోనే సరిపెట్టుకుంది. అహ్మదాబాద్‌లో 125 స్థానాల ఫలితాలు వెలువడగా బీజేపీ 101 స్థానాలు గెలుకుంది. కాంగ్రెస్ కేవలం 15 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక ఎంఐఎం 4 స్థానాలను గెలుచుకుంది.
ఈ సాయంత్రం రాష్ట్ర బిజెపి కార్యాలయం వద్ద విజయోత్సవాలు జరుపుకోనున్నారు. ఈ ఉత్సవాలలో ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ఉప ముఖ్యమంత్రి నితిన్ పాటిల్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సి ఆర్ పాటిల్ పాల్గొంటారు.
సూరత్ మున్సిపాల్టీలో అనూహ్యంగా కాంగ్రెస్‌ను ఆమ్ ఆద్మీ బీట్ చేసింది. ఆ మున్సిపాల్టీలో బీజేపీనే లీడింగ్‌లో ఉన్నా.. ఆమ్ ఆద్మీకి చాలా స్థానాలు దక్కడం విశేషం. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 46 శాతం ఓటింగ్ పోలైంది. అహ్మాదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భావనగర్, జామ్‌నగర్ పట్టణాల్లో ఉన్న 144 వార్డులకు పోలింగ్ జరిగింది.
72 సీట్లు ఉన్న రాజ్‌కోట్ మున్సిపాల్టీలో బీజేపీ 68, కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకున్నాయి. మరో 12 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. 120 స్థానాలు ఉన్న సూరత్‌లో బీజేపీ 93 స్థానాలు గెలవగా కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెలుపొందలేదు. అనూహ్యంగా ఆప్ 27 సీట్లు గెల్చుకొంది.
76 సీట్లు ఉన్న వడోదరలో ఇప్పటికే బీజేపీ 48, కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకున్నాయి. మరి కొన్ని ఫలితాలు రావలసి ఉంది. 64 సీట్లు ఉన్న జామ్‌నగర్‌లో బీజేపీ 60, కాంగ్రెస్ 11, బీఎస్పీ 3 సీట్లు గెలుచుకున్నాయి. 52 సీట్లు ఉన్న భావనగర్ లో బిజెపి 44, కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకున్నాయి. 192 సీట్లు ఉన్న అహ్మదాబాద్ లో మధ్యాన్నంకు బిజెపి 72, కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకున్నాయి.
More Stories
కెనడాలో హిందూ ఆలయంపై దాడి పిరికిపంద చర్య
కాంగ్రెస్, ఆర్జేడీలు గిరిజన వ్యతిరేకులు
మహారాష్ట్ర డీజీపీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు