పరీక్ష ఫీజుకు, టర్మ్ ఫీజుకు లింక్ పెట్టవద్దు 

కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులు, లెక్చరర్ల ను వేధించకుండా  వారికి కనువిప్పు కలిగించాలని వసంత పంచమి సందర్బంగా సరస్వతీ  అమ్మవారిని ప్రార్ధించిన్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. పరీక్షా ఫీజుకు, టర్మ్ ఫీజుకు లింక్ పెట్టి విద్యార్థులను వేధింప వద్దని ఆయన వారికి విఘ్న్పతి చేశారు. 
 
పరీక్ష ఫీజులు కట్టాలంటే   మొత్తం టర్మ్ ఫీజులు  చెల్లించాల్సిందే అని కార్పొరేట్ విద్యా సంస్థలు కండీషన్ పెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం 2 నెలలకే మొత్తము ఫీజు చెల్లించాలని విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విద్యార్థి ని కూడా పరీక్ష ఫీజు కట్టించుకునేందుకు టర్మ్ ఫీజుతో లింక్ పెట్టొద్దని ఇంటర్ బోర్డు, సెకండరీ బోర్డు చెప్పాయని  గుర్తు చేశారు.

కేవలం రెండు నెలల కోసం మొత్తమ్ ఏడాది ఫీజు వసూలు చేస్తుంటే విద్యా శాఖ అధికారులు కళ్ళు మూసుకుని కూర్చున్నారా అని సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కార్పొరేట్ విద్య సంస్థల వెనుక టీఆరెస్ పెద్దలు ఉన్నందువల్లనే ఇంటర్ బోర్డు మౌనం వహిస్తుందోదని ఆరోపించారు.
గతం లో లాగా ఇంటర్ విద్యార్థులకు ఏమైనా నష్టం వాటిల్లితే ప్రభుత్వ పెద్దల్ని ఎవరిని వదలం అని హెచ్చరించారు.

లెక్చరర్లు, టీచర్లకు వెంటనే జీతాలు చెల్లించాలని మరో సారి సంజయ్ డిమాండ్ చేశారు. సిబ్బందితో యాజమాన్యాలు వెంటనే మీటింగ్ పెట్టుకుని జీతాల సమస్య పరిష్కరించాలని సూచించారు. మేధావులు, విద్యావంతులైన సిబ్బంది కి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఉసురు పోసుకోవద్దని హితవు చెప్పారు.

ఫీజుల విషయం లో, సిబ్బంది వేతనాల చెల్లింపు విషయం లో అధికారులు మౌనం వహించడం వెనుక ఎవరి ప్రయోజనం దాగుందో తమకు తెలుసని సంజయ్ ధ్వజమెత్తారు. సందర్భం వచ్చినప్పుడు కాలేజీల చరిత్ర, టీఆరెస్ నేతల బండారం బయట పెడతామని హెచ్చరించారు.