మహారాష్ట్రలో ఖలిస్థాన్ ఉగ్రవాది అరెస్ట్

మహారాష్ట్రలో ఖలిస్థాన్ ఉగ్రవాది అరెస్ట్
ఖలిస్థాన్ ఉగ్రవాది సరబ్‌జిత్ సింగ్ కిరాట్‌ను మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలో పంజాబ్ సీఐడీ అధికారులు, మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని లూధియానా జిల్లాకు చెందిన సరబ్‌జిత్ సింగ్ కిరాట్ ను పంజాబ్ సీఐడీ అధికారులు, మహారాష్ట్ర పోలీసులు ఆదివారమే అరెస్టు చేసినా అతన్ని ఖలిస్థాన్ కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకు వీలుగా బయటపెట్టలేదు. 
 
భారతదేశానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ కార్యకలాపాలను సరబ్ జిత్ సింగ్ సాగిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. లక్నోలో ఉన్న మరో ఖలిస్థాన్ ఉగ్రవాదిని పంజాబ్ పోలీసులు యూపీ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ కు చెందిన జగదేవ్ సింగ్ అకా, జగ్గా అనే ఖలిస్థాన్ ఉగ్రవాదిని ప్రశ్నించారు. 
 
ఖలిస్థాన్ ఉగ్రవాదులు పరంజిత్ సింగ్ పమ్మా, మల్తానీ సింగ్ లతో అరెస్టు అయిన ఖలిస్థాన్ ఉగ్రవాదులకు సంబంధాలున్నాయని దర్యాప్తులో తేలింది. అరెస్టు చేసిన ఖలిస్థాన్ ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు రిమాండుకు తరలించారు. సరబ్జీత్‌ రెచ్చగొట్ట ప్రసంగాలతో సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నాడని పంజాబ్‌ పోలీసులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు పంజాబ్‌ పోలీసులతో జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా లక్నోలోని వికాస్‌ నగర్‌లో యూపీ పోలీసులు ఖలిస్తాన్‌ అనుకూల ఉగ్రవాదులకు సన్నిహితుడిగా పేరొందిన జగ్దేవ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేశారు.