ప్రమాదకర పరిస్థితులలో బాలకార్మికులతో పని చేయిస్తున్న జార్ఖండ్ నుండి మైకాను కంపెనీ తెప్పిస్తున్నదా అనే దానిపై దర్యాప్తు చేయడానికి పాప్ స్టార్ రిహన్న అందాల సంస్థపై దర్యాప్తుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ (ఎన్‌సిపిసిఆర్) ఆదేశాలు జారీచేసింది. వ్యవసాయ చట్టాలపై గుప్పిస్తూ ట్వీట్ లు ఇచ్చి అంతర్జాతీయ దృష్టి ఆకట్టుకోవడం ద్వారా ఆమె “అంతర్గత వ్యవహారాలలో జోక్యం” అంటూ భారత ప్రభుత్వ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.
లీగల్ రైట్స్ అబ్జర్వేటరీకి చెందిన వినయ్ జోషి దాఖలు చేసిన ఫిర్యాదులో, అమెరికాకు చేసిన ఈ పాప్ స్టార్ కు చెందిన కాస్మెటిక్ ప్రొడక్ట్ కంపెనీ, జెంఖండ్ లోని కోడెర్మా, గిరిదిహ్, నవాడల నుండి మైకా కొనుగోలు చేసే ఫెంటీ బ్యూటీ బ్రాండ్ సప్లై చైన్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ పొందిందా లేదా అని తనిఖీ చేయాలని ఎన్సిపిసిఆర్ ఆ సంస్థపై చర్యలు ప్రారంభించింది.
“నివేదికల ప్రకారం, అమెరికా పాప్ స్టార్ రిహన్న బ్యూటీ ప్రొడక్ట్ ‘ఫెంటీ బ్యూటీ’ జార్ఖండ్ నుండి బ్లడ్ మైకాను ఉపయోగిస్తుంది, దీనిలో బాల కార్మికులు ప్రమాదకర పరిస్థితు
మీడియా కధనాల ప్రకారం, కమిషన్ ఈ విషయాన్ని పరిశీలిస్తోందని, “అవసరమైన చర్యలు తీసుకొంటుంది” అని ఎన్‌సిపిసిఆర్ చైర్మన్ ప్రియాంక్ కనూంగో తెలిపారు. ఆ మైకా బాల కార్మికులతో పని చేయించుకోలేదని నిర్ధారించడానికి, ధృవీకరణ సంస్థలు ఉన్నాయని ఫిర్యాదులో జోషి చెప్పారు. “కానీ మీడియా నివేదికలు ఫెంటీ బ్యూటీకి రెండింటి నుండి సప్లై చైన్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ (ఎస్సిసిసి) లేదు” అని ఫిర్యాదు చేశారు.
మానవ అక్రమ రవాణా, బానిసత్వం, పిల్లల దుర్వినియోగం కోసం కాలిఫోర్నియా చట్టం ప్రకారం సరఫరాదారుల ప్రవర్తనా నియమావళికి సంబంధించి తప్పనిసరి ఆడిట్లను నిర్వహించలేదని రిహన్న ఫెంటీ ఫెంటీబ్యూటీ ప్రకటించింది. వారు బాల కార్మికులను ఉపయోగిస్తున్నారని చెప్పే తెలివైన మార్గం ఇదని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరోపించాయి.
More Stories
జమిలి ఎన్నికలకు పట్టుదలతో మోదీ ప్రభుత్వం
వైద్యులందరికీ ప్రత్యేక ఐడీలు
హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు