దేవాదాయ శాఖను ప్రభుత్వ పరిధి నుండి తప్పించాలి 

ఆంధ్ర ప్రదేశ్ లో దేవాదాయ,ధర్మాదాయ శాఖను ప్రభుత్వ ఆధీనం నుండి తొలగించి, స్వతంత్ర వ్యవస్థ అధీనంకు అప్పచెప్పాలని రాష్ట్రంలోని హిందూ సంఘాలు, మతాచార్యులు రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. మూడు రోజుల క్రితం తిరుపతి సమీపంలో జరిగిన ధర్మాచార్యుల సదస్సులో సహితం ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. 

ఆంగ్లేయుల పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో అంటే నేటి కేరళ,తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో (1956 తర్వాతే నేటి తెలంగాణలో) ఆంగ్లేయులు సృష్టించిన దేవాదాయ శాఖ ఏర్పడింది,అంతకు ముందు లేదు. ఆదాయం ఉన్న, హిందూ ప్రముఖ దేవాలయాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో కి తెచ్చి దేవాదాయ, ధర్మాదాయ శాఖ ను ఏర్పరిచారు.

దేశంలో మరే ఇతర రాష్ట్రాలలో ఈ పద్ధతి లేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 70 సంవత్సరాలలో మన దేశ అవసరాలకు అనుగుణంగా అనేక మార్పులు చేసుకున్నాము. కానీ దక్షిణాది రాష్ట్రాలలో దేవాదాయ శాఖ పేరుతో హిందూ దేవాలయాల పై ఆధిపత్యంలో మార్పు రాలేదు.రోజు రోజుకు రాష్ట్ర ప్రభుత్వాల మితిమీరిన జోక్యం దేవాదాయ శాఖ పై పెరిగింది.

ఈ సందర్భంగా అనేక వైపరీత్యాలు జరుగుతున్నాయి: 

* దేవాలయాల ఆదాయాన్ని ధార్మిక ఇతర కార్యక్రమాలకు= ఇతర ఖర్చులకు మళ్ళించడం

* దేవాదాయ శాఖలో హైంద వేతర ఉద్యోగస్తుల ను నియమించడం,ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా వారిని తొలగించ క పొవ్వడం

* ధార్మాచార్య సభ తీర్మానాలను దేవాదాయ శాఖ లెక్క పెట్టక పోవడం. ఉదా: హిందూ ధర్మ ప్రచారం చేస్తున్న సంస్థలకు ఆర్థిక సహాయం మానివేయడం

* టిటిడి లాంటి సంస్థలు దర్మాచార్య సదస్సును నిర్వహణ చేస్తూంటే హై కమెండ్ ఆదేశాలతో సదస్సు నిర్వహణను ఆపివేయడం జరిగింది.దర్మాచార్యుల సమావేశానికి పాలకుల అనుమతి కావాలా?

గతంలో రెండుసార్లు – ఒకసారి వై ఎస్  రాజశేఖర రెడ్డి, మరోమారు కె  రోశయ్య ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ఇలా జరిగింది. పీవీఆర్కే  ప్రసాద్  స్వర్గస్థులు అయిన తరువాత గత తెలుగు దేశం ప్రభుత్వం, నేటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  ప్రతి సంవత్సరం జరిపే దార్మాచార్య సదస్సు నిర్వహణకు కి అనుమతిని ఈయలేదు, జరప లేదు.

* తమ ఆస్తులను ధార్మిక,సామాజిక, విద్యా సంస్థల కు దానాలు చేసిన వ్యక్తులు గా మంచి పేరు గల్గిన వారు విజయనగరం మహారాజులు.వంశ పారంపర్య ధర్మకర్తగా ఉన్న శ్రీ అశోక్ గజపతి రాజు ను తొలగించిన తీరు,రామ తీర్థం దేవాలయంలో స్వామీ వారి మూర్తి ముక్కలు చేయ బడిన తరువాత దేవాలయ పునర్నిర్మాణం కొరకు ఇచ్చిన చెక్కును,దేవాదాయ శాఖ తిరస్కరించడం రాజకీయంతో బ్రష్టు పట్టిన దేవాదాయ ధర్మాదాయ శాఖ కు ఒక తాజా ఉదాహరణ. శ్రీ అశోక్ గజపతి రాజు ను తొలగించిన తీరు చట్ట బద్ధంగా లేదని హై కోర్టు తీర్పును ఇవ్వడం గమనార్హం

* రాష్ట్రంలో దేవాలయాల పై దాడులు,స్వామి మూర్తుల విశ్వాసం,నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న దేవాదాయ శాఖ,కేవలం ఒక రాజకీయ నాయకుని వలె వ్యవహరిస్తున్న నేటి దేవాదాయ శాఖ మంత్రి, అన్ని విధాలా బాధ్యతలను విస్మరించిన దానికి ఉదాహరణలు.

* ఇతర మతాలు తమ సంస్థల ద్వారా మత ప్రచారం విపరీతంగా చూస్తున్నప్పుడు, హిందూ దేవాలయ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వలన ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వలన హిందూ మత ప్రచారం దేవాదాయ శాఖ ద్వారా జరగడం లేదు.దేవాదాయ శాఖ అధికారులకు హిందూ ధర్మ ప్రచార అవశ్యకత పై కనీస అవగాహన లేదు. ఈ పోటీని తట్టుకుని హిందూ మతం నిలబడాలంటే హిందూ దేవాదాయ సంస్థలను ప్రభుత్వ ఆధీనంలో నుంచి తప్పించడం చాలా అవసరం.

ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ పాపం పండింది రాష్ట్ర ప్రభుత్వం నుండి దేవాదాయ శాఖ ను తప్పించాలని, ధార్మిక విశ్వాసాలు ఉన్న స్వతంత్ర వ్యవస్థ కు అప్పచెప్పాలనే డిమాండ్ కు విశేషమైన మద్దతు లభిస్తున్నది.