
స్థానిక ఎన్నికల నేపథ్యంలో సోము వీర్రాజు బుధవారం ఉదయం జనసేన నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇతర పార్టీలు పోటీలో ఉండొద్దనడం సరికాదని ముఖ్యమంత్రికి హితవు చెప్పారు. తాము ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియపై చర్చిస్తామని, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తే గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
బీజేపీ, జనసేన కలిసి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తాయని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లు వేసేలా చర్యలు చేపట్టాలని ఆయన ఎన్నికల కమీషన్ ను కోరారు. ఈనెల 29లోగా ఆన్‌లైన్ నామినేషన్లపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
కాగా, తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిపై తమకు స్పష్టమైన విధానం ఉందని చెప్పారు. ఇరు పార్టీలు పొత్తుతో, అందరకీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇరు పార్టీలకు ఎక్కడెక్కడ ఎంత బలం ఉందో చూసి, అభ్యర్థులను ఎంపిక చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు