అనంతరం ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తాజా పరిస్థితులపై ఇరువురూ సుమారు అరగంటకు పైగా చర్చించారు. మరీ ముఖ్యంగా త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలపై కీలకంగా చర్చించారు. ఎంపీ అభ్యర్ధిని ఎవర్ని బరిలోకి దింపాలనే విషయంపై మాట్లాడారు.
భేటీ అనంతరం సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధిపై చర్చించామని తెలిపారు. ‘ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగుతారు. బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారా..? లేకుంటే జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో ఉంటారా..? అనేది మాకు ముఖ్యం కాదు” అని స్పష్టం చేసారు.
ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశామని వీర్రాజు వెల్లడించారు. 2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం అని పేర్కొంటూ ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఇరు పార్టీల అధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా ఆలోచన చేశామని పేర్కొన్నారు. కుల, మత వర్గాల బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తామని అని వీర్రాజు భరోసా వ్యక్తం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ నిబద్ధతతో, కలసికట్టుగా పోటీ చేసిన తీరులోనే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయాల్సివుందని, అప్పుడే తమ కూటమికి విలువ వుంటుందంటూ ఇటీవల తిరుపతి పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం.
More Stories
‘జమిలి’ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పూర్వ క్షేత్ర సంఘచాలక్ జస్టిస్ పర్వతరావు కన్నుమూత
ఏపీ ఏకైక రాజధాని అమరావతి మాత్రమే