రాజ్యాంగ సంక్షోభ దిశలో ఏపీ పంచాయతీ ఎన్నికలు!

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరాటం నేడు రాజ్యాంగ సంక్షోభ దిశగా మారాలి సూచనలు కనిపిస్తున్నాయి. కరీనా వ్యాక్సిన్ పంపిణి సాకుతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సహాయ నిరాకరణ పఠిస్తుండగా, మరోవంక ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. క మీషన్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొనలేదు. 
 
విజయవాడలో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్‌ విధి అని, సుప్రీం కోర్టులో నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ముందుకు వెళ్తున్నామని, నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
 
రెవెన్యూ డివిజన్‌ ప్రతిపాదికన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సీఎస్‌, పంచాయతీ ముఖ్య కార్యదర్శి హాజరు కావాలని కోరామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయని పేర్కొన్నారు.
 
కాగా, పంచాయితీ రాజ్ కమిషనర్ మరింత మెరుగ్గా వ్యవహరించాల్సి ఉందన్నారు. పంచాయితీ రాజ్ కమిషనర్ పూర్తిగా విఫలమవ్వడం చాలా బాధాకరమని తెలిపారు. కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో పీఆర్ కమిషనర్ అలక్ష్యంతో ఉన్నారని విమర్శించారు. పీఆర్ కమిషనర్‌పై సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
 విధిలేని పరిస్థితుల్లోనే 2019 జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కొత్త జాబితా ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని, విధిలేని పరిస్థితుల్లో 2019 జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలతోనే స్థానిక నాయకత్వం బలపడుతుందని పేర్కొన్నారు. విధులు, నిధులు, అధికారాలు ఎన్నికల వల్లే సాధ్యం ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, ఐజీ స్థాయి అధికారితో ఏకగ్రీవాలపై దృష్టిపెట్టనున్నట్లు పేర్కొన్నారు. 
 
ఎన్నికల సంఘానికి నిధులు, సిబ్బంది కొరత వంటి సమస్యలున్నాయని పేరొక్నటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ప్రభుత్వ ఉదాసీనత వైఖరిపై గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.  
 
మరోవంక, ఏపీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పెట్టిన వీడియో కాన్ఫరెన్స్ డెడ్ లైన్ ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్లు, అధికారులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో నిమ్మగడ్డ సాయంత్రం 5 గంటల వరకు డెడ్ లైన్ పెట్టారు. ఆయన ఎదురు చూపులకు ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన ఎలాంటి చర్య తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా పరిణామాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సోమవారం గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది. 
 
ఇలా ఉండగా,  ఎన్నికలను వాయిదా వేయాలని సీఎస్, నిమ్మగడ్డకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేయగా, ఈ విజ్ఞప్తిని ఎస్‌ఈసీ తిరస్కరించారు. మరోవైపు ఎన్నికలను బహిష్కరిస్తాం..అవసరమైతే సమ్మెకు సిద్ధమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు.